మంచిఫలం పుణ్యరూపంలో, చెడు ఫలం పాపరూపంలో ఉంటుంది. శరీరాన్ని ఆశ్రయించి కుడి, ఎడమ చేతులు ఉన్నట్లే, మానవుడు చేసే పనుల ద్వారా ఫలితాలు ఉంటాయి. పుణ్యకార్యం ద్వారా లభించే ఫలంతో మనిషికి రాజ్యాలు, పశు సంపదలు, ధనం, బంగారం వంటి సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి. కొన్ని పనులకు ఫలం వెంటనే లభిస్తుంది. మరికొన్నిటికి తర్వాత లభిస్తోంది.
ఉదాహారణకు: రైతు భూమిలో విత్తనం నాటిన రోజున పంట లభించాలంటే అది సాధ్యం కాదు కానీ ఎర్రగా కాలిన నిప్పుపై చేయి పెట్టామంటే వెంటనే దుఃఖరూపంలో అనుభవమవుతుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునితో నీకు కర్మ చేయడానికి అధికారముంది. ఫలితం మాత్రం పరమాత్ముని ఆధీనంలో వుంటుందని చెప్పాడు. అనుభవించవచ్చు లేదా ఆ తరువాత జన్మలోనైనా అనుభవించవచ్చు. ఇది నిర్ణయించేది సృష్టికర్త అయిన పరమాత్ముడని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు.