కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 147 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సీపీ వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే అల్లుడు నవీన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో డి.జె.హళ్లి, కె.జె.హళ్లి పోలీస్స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీపీ తెలిపారు.
__విశ్వ సంవాద కేంద్రము
ముస్లిములను కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ ముస్లిం మూకలు ఆగ్రహంతో శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు డి.జే.హళ్లి ఠాణాపై రాళ్ల దాడి చేశారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్ ఎదుట ఉన్న వాహనాలను తగులబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి సహా, భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు నిరసన కారులు మృత్యువాత పడ్డారు. నిరసనకారులు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు.Karnataka Congress MLA Akhanda Srinivas murthy house attacked by peaceful people for a controversial post on Prophet Muhammad by one of his relative.— Sangram Anmol (@SangramAnmol) August 12, 2020
In TN, DMK/DK/NTK mocking our Hindu gods and still Hindus are called intolerance #aajtak @abpnews #karnatkanews @ThePushpendra_ pic.twitter.com/hpHne1974x