లక్షల ఎకరాల భూముల్ని మింగేస్తూ వక్ఫ్బోర్డ్ చేస్తున్న భూ జీహాద్ ప్రమాదకరం !
__సుప్రీంకోర్టు న్యాయవాది హరిశంకర్ జైన్
విశాఖపట్నం, ఆగస్టు 10: వక్స్ బోర్డు చేస్తున్న భూ జిహాద్, లవ్ జిహాద్ కన్నా ఎన్నో రెట్లు ప్రమాదకరమైనది. హిందువులందరూ దీనికి వ్యతిరేకంగా సంఘటితమై చట్టపరమైన పోరాటం చేయాలి.' అని సుప్రీం కోర్టు న్యాయవాది, "న్యాయం కొరకు హిందూ వేదిక (హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్) అధ్యక్షులు హరి శంకర్ జైన్ పిలుపునిచ్చారు.
హిందూ జనజాగృతి సమితి నిర్వహిస్తున్న 'తొమ్మిదవ అఖిల భారత హిందూ దేశ ఆన్లైన్ సదస్సు'లో మాట్లాడుతూ 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అనంతమైన హక్కులను కల్పిస్తూ పక్స్ బోర్డు చట్టంలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఈ మార్పు వల్ల కనిపించిన ఏ భూమినైనా అది దేవాలయాలకు చెందినదైనా సరే, తనదేనని ప్రకటించుకునే శక్తి వక్స్ బోర్డు వశమైందన్నారు.
ప్రస్తుతం ఆరు లక్షల ఎకరాల భూమి ఈ బోర్డు సొంతం చేసుకుందని వివరించారు. అత్యధిక భూవిస్తీర్ణం కలిగిన సంస్థల జాబితాలో భారత యుద్ధ సేన, రైల్వేల తర్వాత వకఫ్ బోర్డుది మూడో స్థానంలో నిలవడం దీనికి నిదర్శనమన్నారు.
నిజానికి ఇంత పెద్ద భూసంపద వక్స్ బోర్డుది కానే కాదు. ఈ చట్టం పట్ల హిందువులకు అవగాహన లేకపోవడం, పైగా వారి నిర్దిప్తతల కారణంగా వక్స్ బోర్డు దేశం నలుమూలలా లక్షల ఎకరాలను మింగేస్తూ భీభత్సం సృష్టిస్తోందని అవేదన వెలిబుచ్చారు.
హిందూ జనజాగృతి సమితి యొక్క జాతీయ మార్గదర్శి, సద్గుర (డాక్టర్) చారుదత్త పింగలే 'ప్రాచీన భారతీయ విద్యా విధానము, న్యాయవ్యవస్థ పరిపాలన, వైద్య శాస్త్రము, వాస్తు శిల్ప శాస్త్రము మొదలైనవి వాస్తవానికి ఎంతో అత్యున్నత స్థాయికి చెందినవి మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతి గొప్పవి.
కొడితే, కమ్యూనిస్టు భావజాలంతో కళ్ళు మూసుకుపోయిన నెహ్రూ." మన దేశపు విద్యా విధానాన్ని రూపొందించే పనిని కమ్యూనిస్టుల చేతిలో పెట్టి మరో వేటు వేశారు. తద్వారా మొఘలులు, ఆంగ్లేయులు కలిసి వెయ్యి సంవత్సరాలలో చేసిన నష్టం కన్నా అధిక నష్టాన్ని కమ్యూనిస్టులు కేవలం 70 ఏళ్ల కాలంలో కలిగించారు. ఇప్పుడు కమ్యూనిస్టులు దేశాన్ని ముక్కలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుకే హిందువులు తమ సంస్కృతిని చరిత్రసు పూర్తిగా తెలుసుకొని ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు శక్తిని పుంజుకోవాలి.' అని అన్నారు.
చత్తీస్గఢోని రాయిపూర్ కు చెందిన 'మాన్య షాదని దర్భార్' 9 వ పీఠాధిపతి యుధిష్టర్ లాల్ జీ మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచం సలుమూలల నుంచి ప్రతి ఒక్క హిందువు తన గళం విప్పి హిందూ దేశ స్థాపన తప్పనిసరి అని చెప్పాలి. తద్వారా ప్రపంచం నలుమూలలలో ఉన్న హిందువులందరూ జాగృతులవాలి. మనం ఎంత తొందరగా మేల్కొంటే, అంత తొందరగా హిందూ దేశ స్థాపన సాధ్యపడుతుంది.' అని అన్నారు. కార్యక్రమంలో పాలు పంచుకోవాలి.' అని కోరారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని 42వేల మందికి పైగా వీక్షించారు
మూలము: హిందూ జనజాగృతి సమితి