గుణాలు వాటి స్వభావాలు
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణాల గురించి చాల బాగ వివరణ ఇచ్చాడు. అదియే “గుణత్రయవిభాగ యోగము”ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
త్రివిధాభవతిశ్రద్ధా, దేహినాంసాస్వభావజా
సాత్వికీరాజసీచైనా, తమసీచేతితాంశృణు || (భగవద్గీత)
జీవులకు గల శ్రద్ద, పుర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా వున్నది.
తత్రసత్త్వంనిర్మలత్వా, ప్రకాశకమనామయమ్ |
సుఖసజ్గేనబద్నాతి, జ్ఞానసజ్గేనచానషు || (భగవద్గీత)
అర్జునా! త్రిగునములలో సత్వగుణము నిర్మలమగుటంచేసి, సుఖ జ్ఞానభిలాషల చేత, ఆత్మను దేహమునందు బంధించు చున్నది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల మరియు జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది.
రజోరాగ్మాతకంవిద్ధి, తృష్ణాసజ్జిసముద్భవమ్ |
తన్నిభధ్గ్నాతికౌన్తేయ, కర్మసజ్గేనదేహినమ్ || (భగవద్గీత)
ఓ కౌన్తేయ ! రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది.
తమస్త్వజ్ఞానజంవిద్ధి, మోహనంసర్వదేహినామ్
ప్రమాదలస్యనిద్రభి: తన్నిభాద్నాతిభారతా || (భగవద్గీత)
అర్జునా ! అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులును మొహింపజేయునది .ఆ గుణము, మనుజుచి ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.
తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది.
సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
మనవమనాయో: తుల్యస్తుతుల్య:మిత్రారిపక్షయో:
సర్వారంభపరిత్యాగీ, గుణాతీతస్స ఉచ్యతే || (భగవద్గీత)
మానవమానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
తేజక్షమద్రుతిశ్సౌచం, అద్రోహూనాతిమానితా
భవన్తిసంపదందైవీం, అభిజాతస్యభారతా ||
డమ్బోదర్పోభిమానశ్చ, క్రోధ:పారుష్యమేవచా
అజ్ఞానంచాభిజతస్యా, పార్థా! సంపదమాసురీమ్ || (భగవద్గీత)
పార్థా ! సహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింప కుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోదము, కఠీనపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును .
త్రివిధంనరకస్యేదం, ద్వారంనాశనమాత్మన:
కామ:క్రోధస్థథాలోభ;, తస్మాదేత్త్రయంత్యజేత్ || (భగవద్గీత)
కామ, క్రోధ,లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేఅతువులు కావున, వాటిని వదలి వేయవలెను.
యజన్తేసాత్వికాచేవాన్, యక్షరక్షాంసీరాజసా:
ప్రేతాన్భూతగణంశ్చాన్న్యే , యజన్తేతామసాజనా: || (భగవద్గీత)
సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులును, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించు చుందురు.
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వ పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి: స్యాత్త్రిభిర్గునై: || (భగవద్గీత 18:40)
భూమి, ఆకాశం, దేవతలు, లేక ఏ ఇతర లోకలలోనైన ప్రకృతి నుండి ఉత్పన్నమైన మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణి వుండదు.
సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ || (భగవద్గీత 14:15)
ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు వున్నవి. ఇవి శాశ్వతమైన జీవుని శరీరంలో బందిస్తున్నవి.
శరీరంలోని పురుషుడు(ఆత్మ) ప్రకృతి లోని ఘటనల వలన సుఖదుఃఖాలను అనుభవించినపుడు పరిస్థితుల ఆధారంగా శరీర తత్వంలోని సత్వ, రజ, తమో గుణాల ప్రభావముల ననుసరించి స్పందించి పనులు చేయుటకు నిశ్చయించుకొనును. ఆ విధంగా త్రిగుణాలు జీవునిని శరీరములలో బంధిస్తున్నాయి .
సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత || (భగవద్గీత 14:9)
సత్వ గుణము సుఖములందు, రజోగుణము పనులలోను, తమో గుణము జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలలో బందించును.
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్వం రాజస్తథా || (భగవద్గీత 14:1౦)
రాజస్తమోగుణాలను అణచి సత్వ గుణము వృద్దిచెందును. అదేవిదంగా సత్వతమోగుణాలను అణచి రజోగుణము, సత్వరజోగుణాలను అణచి తమో గుణము వృద్ది చెందును.శరీర, పరిసర పరిస్థితులను అనుసరించి త్రిగుణాలలో ఎదో ఒక గుణము వృద్ది చెందును.
సర్వద్వారేషు దేహే స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యద తద విద్యత్ వివృదం సత్వమిత్యుత్ || (భగవద్గీత 14:11)
ఎప్పుడు మనషి చేసే పనులన్నీ జ్ఞానంతో తెజోవంతమై వుంటావో అప్పుడు సత్వ గుణము వృద్దినొంది ఉన్నట్లుగా తెలుసుకొమ్మని చెప్పబడింది.
లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివ్రుద్దే భరతర్షభ || (భగవద్గీత 14:1౩)
రజోగుణము అధికమైనపుడు లోభము, అణచలేని కోరిక, పనుల ప్రయత్నము, క్రియాశీలత్వము వృద్దినొందును.
అప్రకాశో ప్రవ్రుత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన || (భగవద్గీత 14:1౩)
తమో గుణము వృద్దినొందగా నిస్తేజం, సోమరితనం, బుద్దిహీనత, మోహం వ్యక్తములగును.
సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమౌహో తమసో భవతో జ్ఞానమేవ చ || (భగవద్గీత 14:17)
సత్వ గుణమునుండి జ్ఞానము పెంపొందును.రజో గుణము నుండి లోభము, తమో గుణం నుండి బుద్దిహీనత, మోహము, అజ్ఞానము తప్పక ఉత్పన్నమగును.
ఆయు:సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనః |
రస్యాః స్నిగ్దాః స్థ్హిరా హ్రుద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః || (భగవద్గీత 17:18)
ఆయువు, బుద్ది, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతిని వృద్దిపరుచునట్టి రసవంతరములు, పుస్టికారము, దృఢము, మనః ప్రీతిని కలిగించు ఆహారములు సత్వగుణమదికముగా ఉన్నవారికి ఇష్టమైనవి.
కత్వమ్లలవ ణాత్యుష్ణతీక్ష్న్ రూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః || (భగవద్గీత 17:9)
చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులు మిక్కిలి వేడిగా వున్నట్టివి, ఎండినవి, మంట కలిగించునట్టి ఆహారములు రజోగుణము ఎక్కువగా ఉన్నవారికి ఇష్టము. అవి దుఃఖము, చింత, రోగములు కలిగించును.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ || (భగవద్గీత 18:20)
తినడానికి బాగా ముందు వండినవి, రుచిలేనివి, చెడు వాసన కలిగి కుల్లినట్టివి, వేరొకరు తిని వదిలినవి, నిషిద్ధ పదార్థాలు తమో గుణం ఎక్కువగా ఉన్నవారికి ఇష్టం.
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్వికమ్ || (భగవద్గీత 18:20)
విభజింపబడిన సర్వప్రాణుల యందు అవిభక్తమైన నాశనము లేని ఒకే భావాన్ని (పరమాత్మ) ఏ జ్ఞానముతో చూచునో ఆ జ్ఞానము సాత్విక జ్ఞానమని తెలుసుకో.
ప్రుథక్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్ ప్రుధగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ || (భగవద్గీత 18:21)
ఏ జ్ఞానము వలన విభిన్న శరీరములలోనున్న భావాన్ని విభిన్న ప్రాణులుగా తెలుసుకొనునో ఆ జ్ఞానము రజోగుణ సంబంధమైనదని తెలుసుకో.
యత్తు క్రుత్స్న్ వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్న్వ ర్దవదల్పం చ తత్తామసముదాహృతమ్ || (భగవద్గీత 18:22)
కారణం లేకుండా తత్వార్ధరహితంగా అల్పమైన ఒక పనిలో అదే సర్వస్వమైనట్లు ఆసక్తితో ఏ జ్ఞానము వలన ఉండునో అది తమో గుణ సంబందమైనదిగా చెప్పబడింది.
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి: సా పార్దా సాత్వికీ || (భగవద్గీత 18:౩౦)
చేయవలసినది, చేయరనిది, చేయుట, చేయలేకపోవుట, భయము, నిర్భయము, బంధ మోక్షాన్ని తెలుసుకొనేది సాత్విక బుద్ధి.
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
ఆయథావత్ ప్రజానాతి బుద్ధి: సా పార్త రాజసీ || (భగవద్గీత 18:31)
ధర్మాధర్మాలను , చేయదగినది, చేయవలసినదానిని సరిగా తెలుసుకోలేని బుద్దిని రాజస బుద్ది అందురు.
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతంశ్చ బుద్ధి: సా పార్ధ తామసీ || (భగవద్గీత 18:32)
భ్రాంతిచే కప్పబడి అధర్మాన్ని ధర్మంగాను , అన్ని విషయాలను తప్పు అనే విదంగా భావించేది తామస బుద్ధి .
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణే0దరియ క్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతి: సా పార్ధ సాత్వికీ || (భగవద్గీత 18:34)
అంతరాయము లేని యోగాభ్యసముచే మనస్సు, ప్రాణము, ఇంద్రియముల పనులను నియంత్రించు నిశ్చయమును సాత్విక ధృతి అందురు.
యయా తు ధర్మాకామార్థన్ ధృత్యా ధారయతేర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి: సా పార్ధ రాజసీ || (భగవద్గీత 18:34)
కానీ ఏ నిశ్చయముతో ధర్మార్ధకామ విసయాలలో ఫలాపేక్ష కలిగివుండునో ఆ నిశ్చయమును రాజస ధృతి అందురు.
యయా స్వప్నం భయం శోకం విషాదం మదనేఅవ చ |
నా విముంచతి దుర్మేధా ధృతి: సా పార్ధ తామసీ || (భగవద్గీత 18:35)
కలలతో కూడిన నిద్ర, భయము, దుఃఖము, మదము, చింతనలు వదలని చెడు బుద్ధి కలవని నిశ్చయమును తామస ధృతి అందురు.
సుఖం త్విదానీం త్రివిధం శృణు మెఅ భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖా౦తమ్ చ నిగచ్ఛతి || (భగవద్గీత 18:36)
యత్తదగ్రే విషమివ పరిణామేమ్రతోపమమ్|
తత్సుఖం సాత్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదాజమ్ || (భగవద్గీత 18:37)
ఇక మూడు విధములగు సుఖములను వినుము. వానిలో అనుభవించుట, దుఃఖా౦తము (మోక్ష మార్గం) పొందుట కూడా జరుగును. ఆరంబమున విసయములేనున్నాను చివరలో బుద్దినుండి పుట్టిన ఆత్మ జ్ఞానము వలన కలిగిన అమ్రుతముతో సమానమైనదట్టిది సాత్విక సుఖ మనబడును.
విషయే౦ద్రియసంయోగాత్ యత్తదగ్రేమ్రతోపమామ్|
పరిణామే విషమివ తత్శుఖం రాజసం స్మ్రుతమ్ || (భగవద్గీత 18:38)
ఇంద్రియార్ధములు ఇంద్రియములతో కలియుట వలన కలుగు సుఖము మొదట అమ్రుతముతో సమానముగను చివర విషమువలెను ఉండును. అట్టి సుఖము రజోగుణముతో కూడినదని భావింపబడును .
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్తం తత్తామసముదాహృతమ్ || (భగవద్గీత 18:39)
నిద్ర, సోమరితనము, మోహముల వలన కలిగి మొదటినుంచి చివరి వరకు ఆత్మను అదే సుఖమనిపించే భ్రాంతిలో ఉంచేది తామస సుఖం .
బుద్ధి: జ్ఞానమాసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దు:ఖం భావో భయం చాభయమేవ చ || (భగవద్గీత 10:4)
అహింసా సమతా తుస్టి: తపో దానం యశో యశ : |
భవంతి భావ భూతానం మత్త ఏవ పృథగ్విధా: || (భగవద్గీత 10:5)
బుద్ధి, జ్ఞానము, భ్రాంతి లేకుండుట, క్షమా గుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖము, దుఃఖoము, పుట్టుక, మరణము, భయము, నిర్భయము, అహింస, సమభావము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, మున్నగు వివిధ భావములు జీవులకు నానుండియే కలుగుతున్నవి.సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి