హిందూ దేశ స్థాపనకు సమాయత్తం కండి
తొమ్మిదవ అఖిల భారత హిందూ దేశ సదస్సు ముగింపులో ఎమ్మెల్యే రాజా సింగ్....
విశాఖపట్నం, ఆగస్టు11: '370వ ప్రకరణం రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు, రామమందిర నిర్మాణం మూడింటిని సాధించు కోగలిగాము. సాధించాల్సిన మరో మూడు అంశాలు ఉన్నాయి, అవి కాశీలో విశ్వనాథ దేవాలయ నిర్మాణం, మధురలో శ్రీ కృష్ణ మందిర నిర్మాణం, చివరిగా హిందూదేశ స్థాపన.
హిందూ దేశ స్థాపన చిత్తశుద్ధితోనూ, చేతలతోనూ తప్ప నోటి మాటలతో జరిగే పని కాదు. ఇందుకోసం మనం చత్రపతి శివాజీ మహారాజ్, ధర్మవీర్ సంభాజి మహారాజ్ చూపించిన మార్గంలో ముందుకు సాగాల్సి ఉంది, గోహత్య, లవ్ జిహాద్, భూజిహాద్ వంటి హిందూ ధర్మాన్ని అవమాన పరిచే చర్యలు హిందూ దేశంలో ఉండవు.
హిందూ జనజాగృతి సమితి నిర్వహించిన తొమ్మడవ అఖిల భారత హిందూ దేశ సదస్సు ముగింసింది. ఈ సందర్భంగా తొమ్మిది తీర్మానాలు చేశారు:
అవి..."
- 1. రామమందిర ప్రాంతంలో ఉన్న ఇతర దేవాలయాలను, చారిత్రక కట్టడాలు పునరుద్ధరించాలి.
- 2. మతపరమైన కల్లోలాలు రాకుండా ఉండేందుకు, అన్యమతాలకు సంబంధించిన నిర్మాణాలను నిషేధించాలి.
- 3. హిందువులకు ప్రాథమిక హక్కులను నిరాకరించే ' ప్రార్ధనా స్థలాలు చట్టం 1991ని రద్దు చేయాలి.
- రామ మందిరం లాగే 'మొఘల్ దురాక్రమణదారులు కబ్జా' చేసిన కాశీ, మధుర వంటి వేలాది హిందూ దేవాలయాలను మరియు దేవాలయ భూములను హిందువులకు అప్పజెప్పాలి.
- 4. రాజ్యాంగంలోని 'లౌకిక' అనే దానికి బదులుగా 'ఆధ్యాత్మిక' అనే పదాన్ని చేరున్తూ, అలాగే భారత్ ను హిందూ దేశంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో నవరణ చేయాలి.
- 5. హిందువుల మనోభావాలను పరిగణించి గోహత్య, మత మార్పిడులను నిషేధించే చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
- 6. కాశ్మీరీ హిందువుల పునరావాసం కోసం కాశ్మీర్ లోయలోని "పనున్ కాశ్మీర్' ను కేంద్ర పాలిత ప్రాంతాన్ని ప్రకటించాలి.
- 7. తమిళనాడు లోని నటరాజ మందిరాన్ని ప్రభుత్వ హస్తగతం కాకుండా అడ్డుకోవాలి. నుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి భారత్ లో ఉన్న డేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, దేవాలయ నిర్వహణను భక్తులకు అప్పజెప్పాలి.
- 8. హిందువేతర జనాభా ఇబ్బడిముఖ్బడిగా పెరిగిపోతున్న పరిస్థితుల దృష్ట్యా, సంతులనం కోసం 'జనాభా నియంత్రణ చట్టాన్ని' తక్షణమే అమలు చేయాలి.
- 9. 'హలాల్' సర్టిఫికేషన్ వ్యవస్థను నిషేధించాలి.
మూలము: హిందూ జనజాగృతి సమితి