వారణాసి మహాప్రస్థాన రథసారధి హరిశ్చంద్ర ఘాట్ వంశపారంపర్య కాపరి ‘డోమ్ రాజా’ జగదీష్ చౌదరిజీ విశ్వనాధుని నిజపాదాల చెంతకు చేరారు. ఒక అద్భుతమైన వ్యక్తిని మహాదేవుడు తనదగ్గరకు పిలిపించుకున్నారు.
కాశీ “డోమ్ రాజా” గా ప్రసిద్ధి చెందిన శ్రీజగదీష్ చౌదరి గారు ఆగస్టు 25 వ తేదీన తన శరీరాన్ని వదిలి పెట్టి కాశీ విశ్వేశ్వరుని కైలాసానికి వెళ్లారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని విశ్వహిందూ పరిషత్ కోరుకుంటోంది.
కాశీలో సాధువులు, సంతు మహాత్ములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పూజనీయులైన వారంతా వచ్చారు. సభ జరుపుతున్నారు. సభా వేదికపైన అంతటి మహాత్ముల మధ్య ఒక సాధారణ గృహస్థు కూర్చొని ఉన్నాడు. అతన్ని అభినందిస్తూ, స్వాగతిస్తూ, సన్మానిస్తూ ఒక్కరొక్కరుగా స్వామీజీలు లేచి వెళ్తున్నారు పూలమాలలు మెడలో వేసి గౌరవంగా ఆ గృహస్థుకు ఆశీస్సులు అందజేస్తున్నారు. అంతటి సౌభాగ్యశాలి ఎవరు? అంతమంది స్వామీజీల యొక్క ఆశీస్సులు పొందిన వారు ఎవరు? అని సాధారణ వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.
1994వ సంవత్సరం కాశీలో జరిగిన “ధర్మ సంసద్” సందర్భంగా వేదికను అలంకరించినవారు శ్రీ జగదీష్ చౌదరి గారు.
బాల్యంలో బృందావనం, వార్ధక్యంలో వారణాసి అంటూ గానం చేసే వారణాసిలో మరణించాలని కోట్ల మంది ఆశ. ఇలా వృద్ధాప్యంలో వారణాసి చేరి అక్కడనే భౌతిక శరీరాన్ని వదిలే లక్షలాదిమంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనే నమ్మకంతో ఉంటారు. అటువంటి వారణాసిలో మరణించిన వారికి మోక్షప్రాప్తి కలగడం కోసం పనిచేసే వారుగా తరతరాలుగా అనేక యుగాలుగా వీరి కుటుంబం కాశీలో “కాటికాపరులు”గా ఉంటున్నారు.
కృతయుగంలో సాక్షాత్తు హరిశ్చంద్రుణ్ణి కొనుక్కొని పని చేయించుకున్న వీరి పూర్వీకుల చరిత్ర గొప్పది. అటువంటి గొప్ప వాళ్ళు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ముస్లింల పాలనా కాలం నుండి అంటరాని వారిగా పరిగణించబడుతుండడం బాధాకరంగా తోచిన సాధువులు, హిందూ ధర్మ పెద్దలు హిందుత్వంలో అంటరానితనమే లేదు. లేని అంటరానితనం పేరుతో మనలోవారే, మన వారే అయిన వారిని కాదనుకోవడం వేద సమ్మతం కానీ, శాస్త్ర సమ్మతం కానీ కాదని ‘అంటరానితనం పాటించడం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదు’ అని, దాన్ని సమర్థించడం మూర్ఖత్వమని ప్రకటించారు.
అంతకు మునుపే 1968 వ సంవత్సరం ఉడిపిలో పరమ పూజనీయ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ గారి నేతృత్వంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ ధర్మసభలో సాధుసంతులు ప్రకటించినట్లు
అంటరానివాళ్ళుగా ప్రచారం చేయబడిన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సాక్షాత్తు పూజ్యులు మహంత్ అవైద్యనాథ్ గారు, పూజ్యులు అశోక్ సింఘాల్ గారు వెళ్లడమే కాక వారి ఇంట్లో పూజ నిర్వహించి భోజనం చేసి అనంతరం సాదరంగా ధర్మ సంసద్ కు కలిసి వచ్చారు. ఇలా మనవాళ్లకు చరిత్రలో జరిగిన అవమానాన్ని ఈ తరంలో సరి చేసే ప్రయత్నం వీరి మాధ్యమంగా జరిగింది.
__విశ్వ సంవాద కేంద్రము
కాశీ “డోమ్ రాజా” గా ప్రసిద్ధి చెందిన శ్రీజగదీష్ చౌదరి గారు ఆగస్టు 25 వ తేదీన తన శరీరాన్ని వదిలి పెట్టి కాశీ విశ్వేశ్వరుని కైలాసానికి వెళ్లారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని విశ్వహిందూ పరిషత్ కోరుకుంటోంది.
కాశీలో సాధువులు, సంతు మహాత్ములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పూజనీయులైన వారంతా వచ్చారు. సభ జరుపుతున్నారు. సభా వేదికపైన అంతటి మహాత్ముల మధ్య ఒక సాధారణ గృహస్థు కూర్చొని ఉన్నాడు. అతన్ని అభినందిస్తూ, స్వాగతిస్తూ, సన్మానిస్తూ ఒక్కరొక్కరుగా స్వామీజీలు లేచి వెళ్తున్నారు పూలమాలలు మెడలో వేసి గౌరవంగా ఆ గృహస్థుకు ఆశీస్సులు అందజేస్తున్నారు. అంతటి సౌభాగ్యశాలి ఎవరు? అంతమంది స్వామీజీల యొక్క ఆశీస్సులు పొందిన వారు ఎవరు? అని సాధారణ వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.
1994వ సంవత్సరం కాశీలో జరిగిన “ధర్మ సంసద్” సందర్భంగా వేదికను అలంకరించినవారు శ్రీ జగదీష్ చౌదరి గారు.
బాల్యంలో బృందావనం, వార్ధక్యంలో వారణాసి అంటూ గానం చేసే వారణాసిలో మరణించాలని కోట్ల మంది ఆశ. ఇలా వృద్ధాప్యంలో వారణాసి చేరి అక్కడనే భౌతిక శరీరాన్ని వదిలే లక్షలాదిమంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనే నమ్మకంతో ఉంటారు. అటువంటి వారణాసిలో మరణించిన వారికి మోక్షప్రాప్తి కలగడం కోసం పనిచేసే వారుగా తరతరాలుగా అనేక యుగాలుగా వీరి కుటుంబం కాశీలో “కాటికాపరులు”గా ఉంటున్నారు.
కృతయుగంలో సాక్షాత్తు హరిశ్చంద్రుణ్ణి కొనుక్కొని పని చేయించుకున్న వీరి పూర్వీకుల చరిత్ర గొప్పది. అటువంటి గొప్ప వాళ్ళు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ముస్లింల పాలనా కాలం నుండి అంటరాని వారిగా పరిగణించబడుతుండడం బాధాకరంగా తోచిన సాధువులు, హిందూ ధర్మ పెద్దలు హిందుత్వంలో అంటరానితనమే లేదు. లేని అంటరానితనం పేరుతో మనలోవారే, మన వారే అయిన వారిని కాదనుకోవడం వేద సమ్మతం కానీ, శాస్త్ర సమ్మతం కానీ కాదని ‘అంటరానితనం పాటించడం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదు’ అని, దాన్ని సమర్థించడం మూర్ఖత్వమని ప్రకటించారు.
అంతకు మునుపే 1968 వ సంవత్సరం ఉడిపిలో పరమ పూజనీయ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ గారి నేతృత్వంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ ధర్మసభలో సాధుసంతులు ప్రకటించినట్లు
|| హిందవః సోదరా సర్వే నహిందుర్ పతితో భవేత్
మమదీక్షా హిందు రక్షా మమ మంత్రః సమానతా ||
(హిందువులందరూ సహోదరులు. ఏ హిందువు కూడా అంటరానివాడు కాడు. హిందూధర్మాన్ని రక్షించడమే మన దీక్ష. సమానత్వమే మన మంత్రం) అని ప్రకటించిన క్రమంలోనే, కాశీని సందర్శించిన అనేకమంది సాధువులు, సాక్షాత్తు శంకరాచార్యులవారే ఈ కుటుంబాల ఆతిథ్యం స్వీకరించారు.అంటరానివాళ్ళుగా ప్రచారం చేయబడిన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సాక్షాత్తు పూజ్యులు మహంత్ అవైద్యనాథ్ గారు, పూజ్యులు అశోక్ సింఘాల్ గారు వెళ్లడమే కాక వారి ఇంట్లో పూజ నిర్వహించి భోజనం చేసి అనంతరం సాదరంగా ధర్మ సంసద్ కు కలిసి వచ్చారు. ఇలా మనవాళ్లకు చరిత్రలో జరిగిన అవమానాన్ని ఈ తరంలో సరి చేసే ప్రయత్నం వీరి మాధ్యమంగా జరిగింది.
||స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః||
అని నమ్మిన జగదీష్ చౌదరి గారు, మతం మార్చుకొమ్మని దశాబ్దాల తరబడి అనేక ప్రలోభాలు, అనేక ఒత్తిడులు కలుగజేసినప్పటికీ, విదేశీ మతాలను దరిచేరనీయకుండా తన వాళ్లందర్నీ రక్షించుకున్నారు. అటువంటి మహనీయుడు సదా వందనీయుడు__విశ్వ సంవాద కేంద్రము