ప్రస్తుత సమాజంలో భారతీయులు - ఆత్మన్యూనత
బహుశా ఒక పది సం. ల క్రితం వరకూ కడపని ఇంగ్లీష్ లో Cuddapah అని రాసేవారు. ఇంగ్లీష్ వాడికి బహుశా పలకడం సరిగా రాక అలాంటి స్పెల్లింగ్ పెట్టి ఉంటాడు. అందులో పెద్ద వింత ఏమీ లేదు, కానీ దానిని సరిదిద్ది kadapa అని రాయడం మొదలెట్టడానికి మనకి దాదాపు 60 సం. లు పట్టింది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో కనిపిస్తాయి. గోదావరిని గొడావరి అనడం, గంగని గేన్జెస్ అనడం, పురుషోత్తముడిని పోరస్ అనడం అన్నీ ఈ కోవలోకే వస్తాయి. దీనికి కారణం భారతీయుల నరనరాలలో జీర్ణించుకుపోయిన ఆత్మన్యూనత
|
కమలా హారీస్ |
ఈమధ్య అమెరికా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి కమలా హారీస్ గారిని ప్రకటించారు. అప్పటివరకూ తనని తాను నల్ల జాతి, బాప్టిస్ట్ గా వర్ణించుకున్న ఆవిడగారికి (ఆవిడ తండ్రి గారు నల్ల జాతీయులు) అకస్మాత్తుగా భారతదేశం మీద ప్రేమ పుట్టుకువచ్చింది. ఎదో సమావేశంలో పిన్ని అని తమిళంలో అన్నారట, ఇక మనోళ్ళలో కొందరి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆత్మన్యూనత కాక ఇంకేమిటిది. వెయ్యి సంవత్సరాల పరాయి దాడుల, 70 సం. ల కమ్యూనిస్ట్ చరిత్రకారులు దాడుల ఫలితం ఇది.
ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికత మనది. గత 2000 సం. లలో 1700 సం. ల పాటు ఆర్ధికంగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన దేశాలలో మనది ఒకటి. పాశాండ అబ్రాహామిక్ మతాల దాడులను ఎదుర్కొని తన సంస్కృతిని నిలబెట్టునకున్న ఏకైక దేశం మనది. ఇలా చెప్పుకుంటూ పోతే, మరే ఇతర దేశానికీ లేని ఎన్నో గొప్పతనాలు మన దేశానికి ఉన్నాయి. ఇకనైనా మనం ఈ ఆత్మన్యూనత నుండి బయటపడాలి. ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప, తెల్లగా ఉంటే గొప్ప, కోటేసుకుంటే గొప్ప అనే ఈ మానసిక బానిసత్వం పోవాలి. మన తరువాతి తరంలో ఈ సమస్య ఏమాత్రం ఉండకుండా మనం ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకోవాలి
వ్యాసరచన:
వడియాల రంజిత్