చుండ్రు నివారణ
వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును .
గృహ చికిత్సలు :
- 1. గోరు వెచ్చని నువ్వల నూనెను తలకు + శరీరమంతటికి మర్దన ( మాలీష్ ) చేయవలెను. 1 గంట తర్వాత పెసర పిండీ ( Green Gram Powder ) తో స్నానం చేయ వలెను.
- 2 .2 or 3 spoon ల మెంతులను1 గ్లాసు నీళ్ళలో రాత్రి నాన బెట్ట వలెను. ఉదయం మెంతులలో + పెరుగు కలుపుతూ పేస్ట్ తయారు చేసుకొన వలెను. నువ్వుల నూనె ను తలకు ( scalp ) కి పట్టిస్తూ 10 నిమిషాల పాటు మర్ధన చేయాలి. ఆ తర్వాత పేష్ట్ ని తలకు బాగా పట్టించాలి . 20 - 30 నిమిషాల తర్వాత పెసర పిండి ( green gram powder ) తో స్నానం చెయ్యాలి.
గమనిక :
- 1. చుండ్రు కొద్దిగా వున్న వారు , మొదటి పద్ధతి ప్రకారము వారానికి 2 లేక 3 సార్లు చేయడం వలన శరీరంలో వున్న వాతము తగ్గి , పగిలిన పెదవులు , మడమలూ మరియు చుండ్రు తగ్గి పోవును .
- 2. చుండ్రు ఎక్కువగా వున్న వారు 2 వ పద్దతి ప్రకారము చేయ వలెను. 1 వారము ప్రతి రోజు చేయ వలెను . చుండ్రు తగ్గని యెడల మరల ఇంకొక వారము ప్రతి రోజు చేయ వలెను . అప్పటికి చుండ్రు పూర్తిగా తగ్గి పోవును . వరుసగా 2 వారాలు చేయ లేని వారు . 1 వారము చేసిన తర్వత 1 వారము Gap ఇచ్చి మరల 1 వారము ప్రతి రోజు చెయ్యండి . పూర్తిగా తగ్గే వరకు చెయ్యండి.
- 3 . చుండ్రు పూర్తిగా తగ్గిన తర్వాత మొదటి పద్ధతి ప్రకారము వారములో ఒక సారి ఖచ్చితంగా చెయ్యండి .
పై పద్దతులు ఆచరించన యెడల , మీ వెంట్రుకలు మృదువు గా తయారవును. క్రొత్త వెంట్రుకలు వచ్చును .
సంకలనం: కోటేశ్వర్