హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందా?
ఇప్పుడిప్పుడే అన్యమతస్థులను కూడా మన దేవాలయాలలోనికి రానిస్తున్నారు. కొన్ని చోట్ల దేవాలయాలలోని కొన్ని ప్రదేశాలకు మాత్రం ఇతర మతస్థులను రానివ్వరు. ఒకవేళ వారిని దేవాలయాలలోనికి అసలు అడుగు పెట్టనీయకపోయినా తప్పేమీ లేదు. కారణమేమంటే, వారు తమతమ దేవాలయాలను సందర్శించేటప్పుడు పవిత్రస్థలాలుగా భావించి ఎటువంటి శ్రద్ధాభక్తులతో వెళతారో అలాగే మన దేవాలయాలలోకి వస్తే మనకేమీ అభ్యంతరం ఉండదు.
కానీ శ్రద్ధ లేకుండా కేవలం యాత్రికులుగా, విమర్శనాత్మక బుద్ధితో, దోషాలు ఎంచటానికి వస్తే మాత్రం దానివల్ల వారికి కలిగే లాభం ఉండదు. పైగా అది మన ఆస్తిక భక్తుల మనోభావాలను కించపరిచినట్టవుతుంది. హిందూమతంలోని అన్ని వర్గాలవారికి ఎలాంటి వివక్షత లేకుండా దేవాలయాలలోనికి ప్రవేశం కల్పించాలి.
ఒక పద్ధతి ప్రకారం అందరికీ దైవాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పించాలి. ఇతరులకు ప్రవేశం కల్పించే విషయం తరువాత ఆలోచించవచ్చు. ప్రస్తుతానికది పెద్దసమస్య కాదు.
రచన: స్వామీ హర్షానంద