ఆకుపూజతో ప్రసన్నుడయ్యే హనుమ
ఎందుకంటే హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకొన్నాడు. ఆమెకి ధైర్యం చెప్పాడు. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేసాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడితో సీతను చూసిన విషయం తెలిపాడు. ఎంతో సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆంజనేయుని మేడలో వేసి అభినందించాడు.
శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు. ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.
హిందూ సంస్కృతిలో తమలపాకు:
హిందూ సంస్కృతిలో ప్రతి పండుగలో, శుభకార్యాల్లో తమలపాకులకు ఎంతో ఫ్రాముఖ్యత ఉంది.- 🍃 తమలపాకుల తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది.
- 🍃 ఆరోగ్యానికి తమలపాకు సేవించమని ఆయుర్వేదం సూచిస్తుంది.
- 🍃 దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం సంప్రదాయంగా పస్తోంది.
- 🍃 విశేషంగా ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది.
- 🍃 శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం.
- 🍃 వివిధ నోములు, ప్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు.
- 🍃 వస్త్రంతో పాటు రెండు తమలపాకులు ఇవ్వడం ఆచారం.
- 🍃 పూజ సమయంలో దేవుని ముందు ఉంచే కలశంలో తమలపాకులు ఉంచుతారు.
ఆరోగ్యపరమైన అంశాల్లో
ఆధ్యాత్మిక విషయాలే కాకుండా ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తమలపాకుకు అగ్రతాంబూలం దక్కింది. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరం.
- ፨ ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- ፨ ఎముకలకు మేలు చేసే కాల్పియం, ఫోలిక్ యాసిడ్, 'ఎ' విటమిన్. 'సి' విటమిన్లు తమలపాకులో పుష్కలంగాఉన్నాయి.
- ፨ ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో ఎక్కువగా వుంటుంది.
- ፨ ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి.
- ፨ సున్నం, తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హాని కాకంగా మారుతుంది.
- ፨ తమలపాకు యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది, అంటే ముసలితనపు ఛాయలు రాకుండా కట్టడి చేస్తుంది.
- ፨ ఈ ఆకురసంను గొంతునొప్పి, శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
- ፨ చెవిలో రసంపిండిన చెవినొప్పి తగ్గిపోతుంది.
- ፨ తమలపాకులో 'చెవికాల్' అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధనలో తేలింది.
- ፨ తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు. అయితే తమలపాకుసు తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది.