బుర్కా ధరించిన మహిళ ఒక దుకాణంలో గణేశుడి విగ్రహాలను పగలగొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీడియోలో, ఇద్దరు మహిళలు హిందూ దేవతల విగ్రహాలను షెల్ఫ్‌లో అమర్చి ఉంచి ఉండడాన్ని చూడవచ్చు.
అప్పుడు స్త్రీలలో ఒకరు విగ్రహాలను ఎత్తుకొని నేలమీద విసిరి పగలగొట్టారు.
ఈ వీడియో చుసిన ఇస్లాంవాదులు విగ్రహాలను పగలగొట్టడం మరియు అలా చేసినందుకు మహిళను ప్రశంససిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.Ma sha Allah alhumma Mubarak— یوسف (@yusufk611) August 16, 2020
విగ్రహాలను పగులగొట్టడం ‘అల్లాహ్ ఆజ్ఞాపించినప్పుడు’ మాత్రమే చేయాలని మరియు అల్లాహ్ నుండి ప్రత్యక్ష సూచనలు లేకుండా విగ్రహాలను ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయడం అన్యాయమని కొందరు అభిప్రాయపడ్డారు.Smashing idols is only done when a prophet is commanded by Allah(swt). We aren’t told to attack other people’s faith in this manner— Aslichutyapa (@aslichutyapa) August 16, 2020
వైరల్ వీడియోకు సంబంధించి బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాపిటల్ గవర్నరేట్ పోలీసు డైరెక్టర్ జనరల్ 54 ఏళ్ల మహిళను ఉద్దేశపూర్వకంగా జుఫైర్లోని దుకాణాన్ని దెబ్బతీసినందుకు మరియు మత విగ్రహాలను విచ్ఛిన్నం చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Source: Opindia