శ్రీవరలక్ష్మి పూజ సామగ్రి:
- ⧫ అమ్మవారి చిత్రపటము
- ⧫ పసుపు,
- ⧫ కుంకుమ,
- ⧫ గంధం,
- ⧫ విడిపూలు,
- ⧫ పూలమాలలు,
- ⧫ తమలపాకులు,
- ⧫ 30వక్కలు,
- ⧫ ఖర్జూరాలు,
- ⧫ అగరవత్తులు,
- ⧫ కర్పూరం,
- ⧫ చిల్లర పైసలు,
- ⧫ తెల్లని వస్త్రము,
- ⧫ రవికల గుడ్డ,
- ⧫ మామిడి ఆకులు,
- ⧫ ఐదు రకాల పండ్లు,
- ⧫ కలశం,
- ⧫ కొబ్బరి కాయలు,
- ⧫ తెల్ల దారం లేదా నోము దారం,
- ⧫ లేదా పసుపు రాసిన కంకణం,
- ⧫ ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
- ⧫ బియ్యం,
- ⧫ పంచామృతాలు.
- ⧫ దీపపు కుందులు,
- ⧫ ఒత్తులు,
- ⧫ నెయ్యి.
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం.
‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.