- ఉల్లి కాడలతో ఆరోగ్య ప్రయోజనాలు -
- 1. ఉల్లి కాడల్లోని అల్లిసిన్ చర్మం ముదతలు పడకుండా కాపాడుతుంది.
- 2. వీటిలోని కెరోటినాయిడ్ లుకంటి చూపును మెరుగు పరుస్తాయి.అలాగే ఎముకలు ధృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
- 3. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ,బి,సి,కె ,యాంటి బాక్టీరియల్,యాంటి ఫంగల్ సుగుణాలు,సల్ఫర్,రాగి,మెగ్నీషియం,పొటాషియం,క్రోమియం,మాంగనీస్ లాంటివి చాలా ఉన్నాయి.
- 4. చక్కెర వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.
- 5. వీటితో దగ్గు,జలుబు,అజీర్తి నయమౌతాయి.
- 6. కెలొరీలు,కొవ్వు, తక్కువగా , పీచు పదార్థం ఎకువగా ఉండడంతో అధిక బరువు తగ్గిస్తాయి.
- 7. గర్భిణీలు తొలి మూడు నెలల్లో తరచుగా తింటే కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది.శిశువుకు వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.
- 8. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్త నాళాలకు చాలా మంచిది.కొలెస్టరాల్ ఆక్సీకరణను తగ్గించి ,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- 9. వీటిలోని సల్ఫర్ కాంపౌండ్ బిపి స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది.కొలెస్టరాల్ స్థాయిలు తగ్గిస్తాయి.
- 10. వీటిలోని క్రోమియం కంటెంట్ మధుమేహాన్ని తగ్గిస్తుంది.ఘ్లూకోజ్ శక్తిని అందిస్తాయి.
- 11. జలుబు , జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది.
- 12. అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
- 13. వీటిలోని పెక్టిన్ పెద్దపేగును క్యాన్సర్కు గురికాకుండా చేస్తుంది.
- 14. కీళ్ళ నొప్పులు ,ఉబ్బసం తగ్గిస్తాయి.కాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.
సంకలనం: కోటేశ్వర్