శుభానికి సంకేతం స్వస్తిక్
స్వస్తిక్ అంటే సు-మంచి, అస్తి - కలగటం, మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. స్వస్తిక్ ఎడమ నుంచి కుడికి తిరుగుతున్నట్టుగా, కాలచక్రంలా కనిపిస్తూ వుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో 'ఓం' అనే ముద్రకి ఎంతటి ప్రాముఖ్యం వుందో, స్వస్తిక్'కు అంతే ప్రాధాన్యం పుంది.'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' ముద్ర |
- 卐 మందరాలలో 'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' కూడా తప్పనిసరిగా కనిపిస్తుంది. దీనిని తడి పసుపులో రాసి కుంకుమ బొట్టు పెడతాం.
- 卐 స్వస్తిక్ గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయి.
- 卐 హిందుత్వాన్ని అనుసరించే బౌద్ధ, జైన మతాల్లో స్వస్తిక్ కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. స్వస్తిక్ ఆకారం సవ్య దిశగా ఉంటుంది. విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం వలె చేడును నివారించి శుభాలను కలిగిస్తుంది. అందుకే ప్రతీ శుభాకార్యాల్లో స్వస్తిక్ ఆకారాన్ని వేస్తారు. గృహప్రవేశాల్లో, పెళ్లి పత్రిక వాహన పూజల్లో, నూతన యంత్రాలు వాడే సమయంలో స్వస్తిక్ గుర్తు ప్రధాన పాత్రను పోషిస్తోంది.
- 卐 ఇంటి గుమ్మంపై కట్టుకుంటే దృష్టి దోషాల నివారణ జరుగుతోందని నమ్మకం. వేద మంత్రోచ్ఛరణ చేసేప్పుడు ఓం శబ్దం తర్వాత 'స్వస్రే' అనే పదం విరివిగా వాడటం గమనిస్తుంటాం. ఏ పని ప్రారంభించినా ఆ కార్యంలో విజ్ఞం కలగరాదనే భావంతో అలా చేస్తుంటారు. విఘ్నహర్త గణేశునికి ప్రతీక ఈ చిహ్నం. కనుక దీన్ని శుభప్రదంగా భావిస్తారు.
- 卐 వినాయకుడి పూజా విధానంలో స్వస్తిక్ ముద్ర మరింత విశిష్టతను సంతరించుకుంది. ప్రత్యేక పూజల సమయంలో కలశ స్థాపన చేసేటప్పుడు, ముందుగా పీఠంపై స్వస్తిక్ ముద్రను దిద్దుతారు. స్వస్తిక్ సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు.
- 卐 పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి ఆశీర్వాదం ఉండాలని ఇలా గీయడం సంప్రదాయంగా వస్తోంది.
- 卐 దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాల్లో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది.
- 卐 నూతన దంపతుల దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచించేందుకు స్వస్తిక్ చిహ్నం ఉపయోగిస్తారు.
- 卐 ప్రపంచం నలుమూలల్లో స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. స్వస్తిక్ మూలాలు పన్నేందు వేల సంవత్సరాల నాటి కాలంలో ఉక్రెయిన్లో లభించింది. పాశ్చాత్య దేశాల్లోని ప్రార్ధనా మందిరాల్లో ప్రసిద్ధ కట్టడాల్లో స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. స్వస్తిక్ గుర్తు హిందూమతంలో నుండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు.
- 卐 వాస్తుపరమైన దోషాలను స్వస్తిక్ ముద్ర నివారిస్తుందని భావిస్తుంటారు.
- 卐 ఇళ్లలోనే కాదు ఆధునీకతకు అద్దంలా కనిపించే ఆఫీసుల్లోనూ, శుభం- లాభం అనే మాట కనిపించే వ్యాపార సంస్థల్లోనూ స్వస్తిక్ ముద్ర కనిపిస్తోంది, స్వస్తిక్ ముద్ర శుభాలను, విజయాలను ప్రసాదిస్తుంటుందనే నమ్మకం ప్రాచీనకాలం నుంచి వుంది.
సంకలనం: కోటేశ్వర్