పవిత్ర ధారణం
దార్భం పవిత్రం తామ్రంవా రాజతం హైమ మేవవా| ధారయేద్దక్షిణే పాణౌ పవిత్రం చోత్తరోత్తరమ్||యాఙ్ఞవల్క్యః|
అనామికా ధృతం హైమం తర్జన్యాం రౌప్యమేవచ| కనిష్ఠికా ధృతం ఖాడ్గం తేన పూతో భవేన్నరః||
తర్జన్యాబి భూయాద్రౌప్యం స్వర్ణంచోప కనిష్ఠయా| గృహస్థః కర్ణయోశ్చైవ శుభేరౌక్మేచ కుండలే||
యోగ పట్టోత్తరీయంచ తర్జన్యారౌప్యమేవచ| కనీయసా సపిత్రాచ నధార్యమితి కౌశికః||
బ్రాహ్మణుడు సౌవర్ణముగాని, రాజతముగాని, తామ్రమయముగాని, దర్భ తోచేసినదిగాని ఐన పవిత్రమును ధరించ వలెను. ఉంగరపువ్రేలి యందు సువర్ణమును, చూపుడు వ్రేలి యందు వెండిని, చిటికెన వ్రేలి యందు ఖడ్గ మృగ సంబంధమునూ ధరించ వలెను. అట్లు ధరించిన పవిత్రత కలుగును.
అదేవిధంగా చెవులయందు సువర్ణ కుండలములను ధరించవలెను. “ తండ్రి జీవించినవాడు, అన్న జీవించి ఉన్నవాడు చూపుడు వ్రేలి యందు వెండిని, యోగ పట్టమును ఉత్తరీయముగా ధరించుట చేయగూడదు” అని కౌశికుడు చెప్పెను.
సంకలనం: కోటేశ్వర్