ఒకసారి ఒక రాజు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిల్చున్నాడు. ఆ ఇంటిలోని ఇల్లాలు వాళ్లాయనకు అన్నం వడ్డిస్తూ వుంది.
ఆమె చాల అందగత్తె, ఆవిడ అందం చూసి రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇంత ఆందమైన అమ్మాయిని ఇదివరకు చుడానేలేదే అని అనుకున్నాడు.
ఆమె భర్త భోజనం చేసి తన పనికోసం బయటికి వెళ్ళాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడా రాజు ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజ వంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. 'ఎవరు మీరు అని ప్రశ్నించింది'. రాజు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా వున్నావు నీ అందం నన్ను వ్యామోహంలో పడవేస్తోంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను. నీవు చూడని సంపద చూడగలవు, నీ అడుగులకు మడుగులోత్తే పనివారు, కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు.
ఆమె ఎంతో తెలివైంది. చక్కటి గుణవంతురాలు, మంచి సంస్కారం కలది. ఆవిడ రాజుతో ఇలా అంది.
రాజా !! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను ముందు మీరు ఆలసిపోయి వచ్చి వుంటారు. శరీరం, మనసు రెండు ఆకలితో వుంటాయి. మీరు వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది.
ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతందని' ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించ లేదు.
ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలను కున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.
రాజా! మీరు భోజనం చేయండి అంటూ వాళ్ల ఆయన తిన్న అరిటి ఆకును రాజు ముందు వేసి ఇలా అంది. "ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు, అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనం చేయండి. మీ ఆకలి తీరాక నేనూ మీతో వస్తాను మీ ఆంతరంగిక కోరిక ఏమైనా తీరుస్తాను. మీ రాజ్యానికి మీతో పాటు వస్తాను అన్నది." ఊహించని ఆ పరిణామానికి రాజుకు ఆమెపై కోపం, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యం కలిగాయి.
"దేశాన్నేలే ప్రభువును నేను, ఎప్పుడూ బంగారు పళ్లింలో ఘుమఘుమలాడే షద్రసోపేతమయిన వంటకాలు వేడి వేడిగా తినే నాకు ఈ ఒక ఎంగిలి ఆకులో భోజనం వడ్డించడానికి నీకెంత ధైర్యం అని గద్దించాడు."
అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది! "మహరాజా! నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా. పెళ్లైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి, భోజనం చేసే విస్తరాకు విషయంలో కలిగిందా, ఎంత ఆశ్చర్యం" అన్నది
రాజుకు ఆమె మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది. కనువిప్పు కలిగింది. మోహం పటా పంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి, సమయస్ఫూర్తికి ముగ్గుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి "తల్లీ నన్ను క్షమించు. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సూక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీవంటి మాతృ మూర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉంది" అని అక్కడి నుండి వెళ్లిపోయాడు
_జాగృతి