కోలాటము పాటలు - ఆంజనేయ రావణ సంవాదం !
యేదేశ పరుడవో || యేదేశ || యేరాజు బంటువో
యెందుండి వస్తవిర వోరీ వనచరీ || యెందుండి ||
స్రుమ్ గారి వనములో సీతమ్మ వుందన్
సూడబోయొ స్థిరావోరీ
యేడేడు సముద్రాలు || యేడేడు || యేకమైపారంగ
నువ్వెట్ల వాస్తవిర వోరీ వనచరీ || నువ్వెట్త ||
నీ కేడు సము ద్రాలు నా కేడు కాలవలు
యెనికి లగుపుతో వస్తినిర వోరీ
యేటి గట్టున వుండే || యేటి || మేటీ కుంబాకర్ణు
డ్వాడెట్లు రానిచ్చె రా వోరీ వనచరీ || వాడెట్ల ||
యేటి గట్టున వుండె మేటి కుంబాకర్ణు
మెదడెల్ల డొక్కొస్తి రా వోరీ
గవిని గా సేవోళ్ళు గవిని || వాళ్ళెట్ట ||
సినలంకి పెదలంకి రానిచ్చిరా వోరీ వసచరీ || వాళ్ళెట్ల ||
లంకిణీ చెయ్యిబట్టి కంకణము యమ బులిమి
యమలోక మంపి స్తిరా వోరీ
నీయంటి బలశాళ్ళు || నీయం ||
నీయంటి మొనగాళ్ళు యింగెంద
రందరోరీ వనచరీ || యింగెంద ||
నీయంటి బలశాక్ళు నాయంటి దాసర్లు
కోటాన కోట్లురా వోరీ
మాటి మాటికి వన్ను మాటి మాటికి నన్ను
వోరోరి అంటావు యేరాజు బంటువుర వోరీ || యేరాజు ||
శ్రీరామ బంటుణి మా రాజు సుగ్రీవులు
అంజనా తనయడు అనుమన్న నాపేరు వోరీ
మీ పట్నమూలోన మీ పట్నమూ లోన
యిట్లాంటి రచ్చలూ యెన్ని న్ని గలవురా వోరి || ఎన్నెన్ని ||
మా వట్నమూలోన మా పట్నమూలోన
యిత్లాంటి రచ్చలు జాలరి జండలేర వోరీ
మీ పట్నమూలోన మీ పట్నమూలోన
యిట్లాంటి మేడలూ యెగ్నిన్ని గలవుర వోరీ || యెన్నెన్ని ||
మా పట్నమూలోన మా పట్నమూలోన
యిల్లాంటి మేడలూ బొమ్మరిండ్లే నేర వోరీ
మీ పట్నమూలోన మీ పట్నమూలోన
యిట్లాంటి వనములూ యెన్ని న్ని గలవుర వోరీ || యెన్నెన్ని ||
మా పట్నమూలోన మా వట్నమూలోన
ఇట్లాంటి వనములూ కూరాకుపాదులేర వోరీ
"వాలినేమో చంపినాడూ వారధీ గట్టించినాడూ
వారధి ముగిసేటి తలికే లంకీ రవధూళి గప్పే"
తరువాయి భాగములో "అంగద రావణ సంవాదము"➤....