ఆవపాలల్లో ఉన్న మాంసకృత్తులను బట్టి పాలు, 'ఏ1 బిటా కెసిన్' మరియు 'ఎ2 బీటా సీన్' అని రెండు రకాలుగా విభజించబడ్డాయి.
ఎ1' మరియు 'ఎ2' పాలకు మధ్య గల వ్యత్యాసం:
ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ , అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉన్న ఆవులలో జన్యుపరమైన మార్పు జరగడం వలన, 'ఎ2' కెసీన్ పాలు 'ఎ1' కెసీన్ పాలగా మార్పుచెందాయి. 'ఎ1' పాలలో 'బీటా కెసొమొర్పిన్ 7' అనే పదార్థం ఉందని, 'అది టైప్ 1 చెక్కర వ్యాధి (డయాబెటిస్), ల్యాక్టోస్ ఇంటాలెరెన్స్, గుండె సంబంధిత జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులు, ఆటిసమ్, షైజోఫ్రీనియా మొదలగు వ్యాధులకు కారకం అవుతుందని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది.
జెర్సీ, హెచ్. ఎఫ్ లాంటి విదేశీ ఆవు పాలలో 80 శాతం ఎ1' రకం, 20 శాతం 'ఎ2' రకం ఉండగా, ఒంగోలు, గిర్, సాహివాల్ వంటి మన దేశీయ ఆవు పాలలో నూటికి నూరు శాతం 'ఎ2' రకం ఉండటం గమనార్హం. విదేశాలలో నానాటికి మన దేశవాళీ ఆవు పాల గిరాకీ పెరుగుతుండటం వలన, 'ఎ2' రకం పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
స్వదేశీ - దేశీయ ఆవుపాల వలన ఆరోగ్య లాభాలు:
దేశవాళీ ఆవు పాలను, పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనాలనుకుంటే పతంజలి వారి దేశవాళీ గోవు ఉత్పత్తులను ఈ లింకు ద్వారా కొనవచ్చును లింక్: 🔗 ➤
సంకలనం: పి. రవికాంత్‌రెడ్డి, పి. హెచ్.డి స్కాలర్. ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం. ఫోను : 7386247618
ఎ1' మరియు 'ఎ2' పాలకు మధ్య గల వ్యత్యాసం:
ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ , అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉన్న ఆవులలో జన్యుపరమైన మార్పు జరగడం వలన, 'ఎ2' కెసీన్ పాలు 'ఎ1' కెసీన్ పాలగా మార్పుచెందాయి. 'ఎ1' పాలలో 'బీటా కెసొమొర్పిన్ 7' అనే పదార్థం ఉందని, 'అది టైప్ 1 చెక్కర వ్యాధి (డయాబెటిస్), ల్యాక్టోస్ ఇంటాలెరెన్స్, గుండె సంబంధిత జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులు, ఆటిసమ్, షైజోఫ్రీనియా మొదలగు వ్యాధులకు కారకం అవుతుందని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది.
జెర్సీ, హెచ్. ఎఫ్ లాంటి విదేశీ ఆవు పాలలో 80 శాతం ఎ1' రకం, 20 శాతం 'ఎ2' రకం ఉండగా, ఒంగోలు, గిర్, సాహివాల్ వంటి మన దేశీయ ఆవు పాలలో నూటికి నూరు శాతం 'ఎ2' రకం ఉండటం గమనార్హం. విదేశాలలో నానాటికి మన దేశవాళీ ఆవు పాల గిరాకీ పెరుగుతుండటం వలన, 'ఎ2' రకం పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
స్వదేశీ - దేశీయ ఆవుపాల వలన ఆరోగ్య లాభాలు:
- ➲ దేశీయ ఆవు పాలు తల్లి పాలకు, చాలా దగ్గరగా ఉంటాయి. సులభంగా అరుగుదలకు తోడ్పడతాయి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయి. అల్సర్, కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్, జీర్ణవ్యవస్థ సంబందించిన, ఎముకుల బలహీనత వంటి వ్యాధులను దరికి చేరనీయవు.
- ➲ దేశీయ ఆవు పాలు రకాల మినరల్స్, 'బి2', 'బి3' మరియు ఎ' విటమిన్లను అధిక మొత్తంలో కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దేశీయ ఆవులలో, తెల్ల ఆవు పాలు వాతాన్ని, కపిల ఆవు (నలుపు, గోధుమ వర్ణముల కలయిక గల ఆవు) పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవు పాలు కఫాన్ని హరించి వేస్తాయి. దేశీయ ఆవులు, విదేశీ ఆవులతో పోలిస్తే ఎండ, చలి, కరువు లాంటి పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా రోగనిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటాయి.
- ➲ దేశీయ ఆవులు అధిక సంతానోత్పత్తి కలిగియుండి, వాటి జీవిత కాలంలో అనేక ఈతల ద్వారా అధిక పాల ఉత్పత్తికి దోహదపడతాయి.
- ➲ కానీ విదేశీ ఆబోతులతో సంకరీకరణం జరపడం వలన, మన దేశీయ ఆవులలో జన్యుపరమైన మార్పులు జరిగి, వాటి జన్యురూపాన్ని కోల్పోతున్నాయి.
- ➲ ఇప్పటికే మన దేశంలో ఉన్న 12 రకాల ఆవులలో అలంబాడి, బింజార్పూరి, కటియాలి, పులికులమ్, బర్దూర్, రాయచూరి రకాలను పోగొట్టుకోగా తార్పార్కర్, ఒంగోలు, హల్లికార్, నాగౌరీ, కె.వి. బ్లాక్, పుంగనూరు వంటివి అంతరించి పోవడానికి సిద్దంగా ఉన్నాయి.
- ➲ భారత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి, దేశీయ ఆవులు అంతరించి పోకుండా వివిధ పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది.
దేశవాళీ ఆవు పాలను, పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనాలనుకుంటే పతంజలి వారి దేశవాళీ గోవు ఉత్పత్తులను ఈ లింకు ద్వారా కొనవచ్చును లింక్: 🔗 ➤ |
సంకలనం: పి. రవికాంత్‌రెడ్డి, పి. హెచ్.డి స్కాలర్. ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం. ఫోను : 7386247618