మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) పేర్కొంది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 30 వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయి’ అని ‘ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు డాక్టర్ వి.కె.మొంగా పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్న వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ కేంద్ర సాయాన్ని తీసుకోవాలని చెప్పారు. ”వైరస్‌కు కళ్లెం పడాలంటే రెండే మార్గాలున్నాయి. మొదటిది… మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. రెండోది… టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం” అని వివరించారు.
___విశ్వ సంవాద కేంద్రము