ఏమిటీ లవ్ జిహాద్..?
గడచిన కొన్ని సంవత్సరాలుగా ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ప్రేమించి, తీసుకెళ్ళి (ఎత్తుకెళ్ళి) ఇస్లాంలోకి మతం మార్చి, పెళ్ళి చేసుకొంటున్నారనే వార్తలను మనం తరచుగా వింటున్నాం. కనబడకుండా పోయిన తమ కూతు రును వెతికే క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు, పోలీసులు రంగంలోకి దిగి పరిశోధన చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు ఇస్లాంలోకి మారిన హిందూ అమ్మాయి పోలీసుల ఎదుట ప్రత్యక్షమయి ‘నేను మేజర్‌ను, కాబట్టి నాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. నేను ముస్లిం అబ్బాయిని ప్రేమించాను, నా ఇష్టప్రకారమే మతం మారాను, అతనిని పెళ్ళి చేసుకున్నాను’ అని ప్రకటిస్తుంది. ఇక ఆ కథకు అంతటితో ముగింపు పలకాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగంలో మేజర్ అయిన పిల్లలు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే అధికారం తల్లిదండ్రులకు, చట్టానికి లేదు. ఈ విధంగా అనేకమంది హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల ప్రేమలో పడి చివరకు మతం మారవలసిన పరిస్థితి ఎదుర్కొని హిందూ సమాజానికి దూరం అవుతున్నారు. దీనికి వారు పెట్టుకున్న ముద్దు పేరు ‘లవ్ జిహాద్’. ఇటువంటి కేసులు ఈ మధ్య సుప్రీంకోర్టు వరకు పోతున్నాయి.
ఇటువంటి కేసే ఒకటి ఈ మధ్య సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన 24 సంవత్సరాల వయసు గల అఖిల అనే హిందూ యువతికి సంబంధించినది. ఆ కేసుపై నవంబర్ 27న సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. విచారణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘నేను నా జీవితంలో ఇటువంటి సంక్లిష్టమైన కేసు ఎప్పుడూ చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ముద్దాయి అయిన 26 సంవత్సరాల వయసున్న జహీన్ అనే ముస్లిం అబ్బాయికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందనే సమాచారం మేరకు ఆ కోణంలో కూడా ఎన్.ఐ.ఎ. దర్యాప్తు చేస్తున్నది. తామిద్దరికీ వివాహ వేదికల ద్వారా పరిచయం అయిందని అఖిల, జహీన్లు చెపుతున్నారు. కాని మతాంతర వివాహాలు జరిపే వివాహ వేదికలు ఎక్కడా లేవు. కాబట్టి వీరిద్దరి మధ్య ఈ పరిచయం ప్రత్యేక ప్రయత్నం ద్వారానే జరిగినట్లుగా భావించవచ్చు.
డ మరో విషయం కూడా గమనించాలి. ఏ కాలంలో అయినా, ఎక్కడైనా ప్రేమ వివాహాలు ఉంటూనే ఉంటాయి. ప్రేమలు సహాధ్యాయుల మధ్య కాని, ఉద్యోగస్తుల మధ్య గాని, ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళ మధ్య గాని చోటు చేసుకుంటాయి. ఈ లవ్ జిహాద్ సంఘటనలలో చిగురించిన ప్రేమలకు అటువంటి సంబంధం ఎక్కడా కనబడటం లేదు. ఈ కేసులో జహీన్కు సమర్థనగా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కపిల్ సిబాల్ కేసు వాదిస్తున్నాడు. ఒక న్యాయవాదిగా సిబాల్ ఆ కేసు విషయంలో జహీన్ తరఫున వాదించవచ్చు. కానీ ఆ కేసుకు కారణం హిందూత్వ శక్తులు అనడం, ప్రెస్ ముందు మాట్లాడటం ఎట్లా అర్థం చేసుకోవాలి?
మతంమార్పిడి కుట్రలు |
మొదటి నుండి ఇస్లాం, క్రైస్తవ మతాలు తమ మతస్థుల సంఖ్యను అధికంగా పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దానికోసం అనేక ఉపాయాలు ఆలోచిస్తాయి. ఈ విషయంలో ఈ రెండు మతాలు పోటాపోటీగా ఉంటాయి. ఇది ఆ మతాలు పుట్టినప్పటి నుండి ఉన్న విశేషతే. క్రైస్తవం తన మతానుయాయులను పెంచుకోవటానికి వ్యక్తుల బలహీనతలు, అవసరాలను ఆసరాగా తీసు కొంటూంటే, ఇస్లామీయులు నేరుగానే రంగంలోకి దిగుతారు. అవసరమైతే హెచ్చరిస్తూ, లేకపోతే రెచ్చగొడుతూ, మరీ అవసరమైతే హింసామార్గంలో వెళ్ళి తమ పని కానిచ్చేస్తారు. వాళ్ళ దృష్టిలో సంఖ్య పెంచాలంటే మత మార్పిడులు మాత్రమే కాదు, దానికంటే ఎక్కువగా ఎక్కువ మందిని వివాహం చేసుకోవటం, అందు లోనూ ఎక్కువగా ఇతర మతాల వాళ్ళను వివాహం చేసుకోవటం, వాళ్ళ ద్వారా మరింత ఎక్కువ మంది సంతానం కనటం. ఇదీ వాళ్ళ యోజన. ఇది భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా సాగుతున్నది.
- 🗡చరిత్రలో ముస్లిం పాలకులు ఎంతోమంది రాజపుత్ర స్త్రీలను బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొన్నారు. వారి అంతఃపురం అందమైన హిందూ స్త్రీలతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేదట.
- 🗡మారుతున్న నేటి పరిస్థితులలో సామూహిక మతంమార్పిడి సాధ్యం కావటం లేదు. అందుని ఈ రెండు మతాలు మతం మార్పిడి కోసం అనేక కుయుక్తులు పన్నుతున్నారు. కుయుక్తుల ద్వారా మతమార్పిడులు చేయడంలో క్రైస్తవులూ తక్కువేమీ కాదు. కాకపోతే వారు సేవ పేరుతో ఇవన్నీ చేస్తుంటారు.
- 🗡ఇస్లాం మతస్థుల సంఖ్య పెంచుకోవటానికి ప్రేమను కూడా యుద్ధరంగంలోకి లాగి దానికి ‘లవ్‌జిహాద్’ అని ముద్దు పేరు పెట్టుకొని యథేచ్చగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు ఇస్లామీయులు. దీనికి దేశమంతా వారి కార్యక్షేత్రమే.
ఎన్.ఐ.ఎ. విచారణ
కేరళలో 13 శాతం జనాభాగా ఉన్న ముస్లింలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. దానిని నిరోధిం చేందుకు అక్కడి హిందూ సమాజం దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నది. దానితో ముస్లిం యువకులు రూటుమార్చి లవ్ జిహాద్ చేస్తున్నారు. వాస్తవానికి కేరళలో ఉండే ప్రభుత్వమే ఆ రాష్ట్రం నుండి వంద మంది ముస్లిం యువకులు సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో ఉన్న ఉగ్రవాద శిబిరాలకు చేరి అక్కడ శిక్షణ పొంది ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మారారని అధికార పూర్వకంగా చెప్పింది.
కేరళ రాష్ట్రంలో గడిచిన 28 నెలల నుండి ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను గుర్తించి ఆ మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది. ఆ జంటలు వివాహం చేసుకోవటానికి దారితీసిన కారణాలపై విచారణ చేస్తున్నది. వివాహానికి ముందు శారీరిక సంబంధాలు ఉన్నాయా, ఇస్లాంకు సంబంధించిన స్థలాల సందర్శన చేసారా ? వివాహానికి ముందా, తదుపరా మతం మార్పిడి ఎట్లా జరిగింది ? అనే విషయాలను అధ్యయనం చేస్తున్నారు. మధ్య ఆసియా దేశాలైన అరబ్బు దేశాల ఆర్థిక శక్తికి, లవ్ జిహాద్‌కు ఏమైనా సంబంధా లున్నాయా అనే కోణంలో కూడా పరిశోధన చేస్తున్నారు. ఈ దిశలో ఎన్.ఐ.ఎ. ఇప్పటికి 89 కేసులను విచారించింది. వాటిలో 9 కేసులకు బలమైన సాక్ష్యాధారాలున్నట్లు గుర్తించింది. ఈ ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. దీనిలో 2 కేసులలో యువతులకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. ఇరాక్‌లోని ఓ విద్యా సంస్థ నుండి ఆ ఇద్దరు యువతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు చేరినట్లుగా గుర్తించారు. మరో యువతి వివాహానంతరం భర్తతో కలిసి సమీప గ్రామాలకు వెళ్ళి యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు వీడియోలు చూపించినట్లుగా నిర్ధారణ జరిగింది.
ఈ లవ్‌జిహాద్ వ్యవహారం కేరళ రాష్ట్రానికే పరిమితమైంది అనుకుంటే అది భ్రమే. కేరళ తర్వాత ఈ రకమైన కార్యకలాపాలు భాగ్యనగరంలో ఎక్కువగా జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. దేశం మొత్తం నుండి 270 మంది యువతీ యువకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
భారతదేశంలో మొట్టమొదటిసారి సర్వోచ్ఛ న్యాయస్థానం మతాంతర వివాహాలు, తద్వారా మతంమార్పిడి, వాటి వెనుక ఉద్దేశ్యాలపై విచారణ చేస్తున్నది. ఈ కేసులో అఖిల మతంమారిన తర్వాత ఆమె పేరు హదియాగా మారింది. వివాహమైన కొద్ది కాలానికే తండ్రి చేసిన ప్రయత్నంతో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశంతో అమ్మాయిని తండ్రి సంరక్షణ నుండి ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. చదువును పూర్తి చేసుకోమని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఆమె చదివే కాలేజి ప్రిన్సిపాల్ ఆమెకు సంరక్షకుడిగా ఉంటారు.
మనం జాగ్రత్తగా గమనించినట్లైతే కేరళ రాష్ట్రంలోనే కాదు, దేశమంతటా ముస్లింలు 3 రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థం అవుతున్నది:
- 1. మతం మార్పిడుల వేగం పెంచటం,
- 2. లవ్ జిహాద్,
- 3. ఇస్లామిక్ సామ్రాజ్యవాదం కోసం ఉగ్రవాద పోరాటానికి సమర్థన తెలియజేయటం.
మతమార్పిడికి అనేక మార్గాలు. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని మల్కాజ్‌గిరిలో విద్య పేరుతో మతంమార్పిడి చేస్తున్న ఒక ముఠాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అనే హిందువు 2003లో ఇస్లాంలోకి మతంమారి మహమ్మద్ సిద్ధికీగా పేరు మార్చుకున్నాడు. ఆ తదుపరి మతం మార్పిడులకు ప్రయత్నం చేయటం అతని నిత్యకృత్యమైపోయింది. ఒక సంవత్సరం క్రితం అతను, మరో 9 మంది కలిసి ‘పీస్ అర్బన్ హోమ్స్’ అనే పేరుతో ఒక సొసైటీని రిజిస్టర్ చేయించుకున్నారు. దాని ఆధ్వర్యంలో మల్కాజ్‌గిరిలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పాలమూరు మొదలైన జిల్లాల నుండి 4 నుండి 14 సంవత్సరాల వయస్సున్న ఎసి.సి., ఎస్.టి. విద్యార్థులను ఎంపిక చేసుకొని తీసుకొచ్చి ఉచిత విద్య, వసతి ఏర్పాట్లు చేశారు. అందులో 10 మంది బాలురు, 7 గురు బాలికలు ఉన్నారు. వారికి ఖురాన్ నేర్పిస్తూ మతమార్పిడులు చేస్తున్నారు. ఈ ముఠాను గుర్తించి, ఆ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలకు తరలించి, ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు తప్పించుకొని పారిపోయారు. మిగిలినవారంతా పోలీసులు అదుపులో ఉన్నారు.
ఇటువంటి బహిర్గతం కాని అనేక యోజనలు నడుస్తున్నాయి. హిందువులు తమ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితులలో వీరి వ్యూహాలలో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై హిందూ సమాజం అవగాహన పెంచుకొని జాగ్రత్త పడవలసిన అవసరం చాలా ఉన్నది.
– రాంపల్లి మల్లికార్జునరావు - (జాగృతి సౌజన్యం తో)