అయీ
రెండక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ' అయ్యైనమః' అని చెప్పాలి.అయీ = ' ఓయీ'! అనునట్లు, “అమ్మా!' అని అమ్మవారిని సంబోధించు పదము.
అమ్మవారి నిర్గుణ, సగుణ తత్త్వాలను సూచించే పదాలు ఇంతకు పూర్వం ముందు రెండు నామాల్లోనూ చెప్పబడ్డాయి. ఈ నామంలో మరొక విధమైన సంబోధనాత్మక 'పదం' అమ్మవారికి నామంగా చెప్పబడుతోంది. మనకు కావలసిన వారు, తెలిసినవారు ఎదురుగా తార సపడితే - వారిని “ఏమోయి' అని ' ఓంయీ'! అనీ అంటాము. అలాగే - పూజనీయురాలైన అమ్మవారిని గూడా అత్యంతమైన భక్తి పూర్వక సాన్నిహిత్యంతో మనం 'ఓయమ్మా ! అని సంబోధించడానికి సూచించే సంస్కృత పదం ' అయీ'.
అమ్మవారితో గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుటలో సూచించు పదమే - ఈ నామము.
ఓం ఐం హ్రీం శ్రీo అయ్యై నమః
శ్రీ మాత్రే నమః