ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ మర్ము నేతృత్వంలో మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమర్నాథ్ యాత్ర నిర్వహించడడం శ్రేయస్కరం కాదని, అందుకే ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నామని సమావేశం అనంతరం అమర్నాథ్ బోర్డు ప్రకటించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వర్చువల్ దర్శన సదుపాయాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఈ యాత్ర నిర్వహించాలని తొలుత భావించినా.. చివరికి రద్దు చేయడం గమనార్హం. గతేడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర సగంలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
___విశ్వ సంవాద కేంద్రము