ఆనంద్ సరస్వతి హిమాచల్ ప్రదేశ్ నుండి సుల్తాన్పూర్ వచ్చారు, చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛటానా గ్రామంలోని వీర్ బాబా మందిరంలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు.
యూపీలోని సుల్తాన్పూర్ గ్రామంలోని వీర్ బాబా ఆలయ ప్రాంగణంలోని బాలయోగి సాధు మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
మృతుడైన సాధువును 22 ఏళ్ల బాలయోగి సత్యేంద్ర ఆనంద్ సరస్వతి మహారాజ్ నాగ బాబాగా గుర్తించారు. పోలీసులు ఇది సహజ మరణం కాదని సమాచారం వచ్చిన తరువాత మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని పోస్టుమార్టం కోసం పంపారు.
హిందూ సాధువు మృతదేహం ఆలయ ప్రాంగణంలోని చెట్టు నుండి వేలాడుతున్నట్లు గుర్తించిన తరువాత, స్థానికులు ఇది హత్య కేసు అని ఆరోపిస్తూ ఆందోళనకుదిగారు. సాధువును మొదట చంపి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టు నుండి ఉరితీసి ఆత్మహత్యలాగా చూపించారని స్థానికులు ఆరోపించారు. ఇది హత్య లేదా ఆత్మహత్య అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.Another Hindu sadhu lynched! 😡😢Balayogi Satyendra Anand Saraswati Maharaj Naga Baba (22) His body was found hanging from a tree in Uttar Pradesh. In the initial investigation, police are considering it murder & further investigation has been initiated. https://t.co/osEoHbad2r pic.twitter.com/8JBk6ziuZQ— JIX5A જીક્સા (@JIX5A) July 23, 2020
దర్యాప్తు పూర్తయ్యాక, పోస్ట్మార్టం నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఇది ఆత్మహత్యనా, హత్య కాదా అని వారు చెప్పగలరని పోలీసులు తెలిపారు.
మూలము: Opindia - తెలుగు భారత్