Yoga Day |
భారతీయ సనాతన యోగ శాస్త్రానికి ఉన్న విలువను, దాని ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించేటట్లు చేసిన , మోదీగారికి ,నా హృదయపూర్వక కృతజ్ఞతలు ,ధన్యవాదాలు ..
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) సందర్భంగా టెలివిజన్లో ,ప్రధానమంత్రి సందేశాన్ని 2024 జూన్ 21 వ తేదీ ఉదయం 6 గంటలా 30 నిమిషాలకు టెలివిజన్ ద్వారా ప్రసారం చేసారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.... ప్రజల జీవితంతో క్రమ క్రమంగా ముడి పడుతున్న యోగ కారణంగా ప్రజల్లో వారి ఆరోగ్యం పట్ల అవగాహన, అప్రమత్తత నిరంతరం పెరుగుతున్నాయని.. ఎక్కువ మంది యోగాపై ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో యోగ ఎంతో ముఖ్యమైనదని..మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాల వ్యవస్థను వైరస్ ఎంతో ప్రభావితం చేస్తుందని.. యోగలో ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల వ్యవస్థను పటిష్ఠం చేసే ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయని తెలిపిన ప్రధాని మోదీ
2024 జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించనున్న ఆయుష్ మంత్రిత్వశాఖ 2024 అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా గల యోగా సాధకులు, 2024 జూన్ 21 వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఒక్కతాటిపైకి రావాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరుతోంది. ఆ రకంగా తమ తమ ఇళ్ల నుంచే యోగా కామన్ ప్రొటోకాల్ ప్రదర్శనలో చేతులు కలపాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరింది.
సంకలనం: కోటేశ్వర్