Yoga Darsanamu |
యోగ దర్శనం
శారీరకంగానూ, మానసికంగానూ,సైద్దాంతికంగానూ, సాంఘీకంగానూ కొన్ని నియమ నిభందనలతో కూడిన అంశాలను సూచిస్తూ రూపొందించబడిన ప్రాచీన శారీరక,మానసిక రుగ్మతా నిరోధక విభాగమే యోగము.
యోగము అంటే ఈ రోజులలో కేవలము వ్యాయామ విభాగానికి చెందినది ఆసనాలు మాత్రమే అని కొందరి భావన.కాని యోగము అంటే కేవలము ఆసనాలు మాత్రమే కాదు యోగము అంటే జీవన విధానము.ఎలా జీవిస్తే అర్ధం ఉందొ తెలిపే విద్యా విభాగము ఈ యోగ దర్శన విభాగము.
యోగధర్శనంలో ఈ కింది శాఖలు కలవు.
అవి:
1.భక్తియోగం.
2.ఆత్మజ్ఞానయోగం.
3.జ్ఞానయోగం.
4.కర్మయోగం.
5.మంత్రంయోగం.
6.తంత్రయోగం.
7.రాజయోగం.
8.హఠయోగం.
ఈ కాలంలో మనం యోగాగా పిలుస్తూ విదేశీయులచే ఆకర్షించబడుతున్న యోగాలో చివరి రెండు విభాగాలు ఉన్నాయి. (రాజయోగం కోసం ప్రయత్నిస్తున్నారు. హఠయోగం పూర్తిగా పాటిస్తున్నారు).