విగ్రహారాధనకు వెనుక ఉన్న ఉన్నత తత్వాన్ని తెలుసుకోకుండా చేసే ఆక్షేపణ ఇది. ఏ హిందువు కూడా విగ్రహమే దేవుడనే భావంతో పూజించడు. ఈ విగ్రహాలు జడపదార్థాలైనా కూడా అవి జ్ఞాపకానికి తీసుకొచ్చేది చైతన్యమయుడైన ఆ పరమాత్మనే. ఒక వ్యక్తి ఛాయాచిత్రం అతని సజీవ చిత్రాన్ని మనస్సుకు తీసుకురాదా? దీన్ని కూడా ఆక్షేపించినట్లయితే శిలువను బైబిలును పూజించే క్రైస్తవులు, 'కాబా' రాతిని ఆరాధించే ముసల్మానులు, జాతీయపతాకానికి వందనమాచరించే దేశభక్తులు.. వీరందరూ కూడ విగ్రహారాధకులే.
ఇక మూఢ విశ్వాసాల్ని గురించి ఎంత తక్కువగా చెపితే అంత మంచిది.
ఇటువంటి మూఢనమ్మకాలు ప్రపంచంలోని అన్ని దేశాల జనులలోను కన్పిస్తాయి. ఇతరులు మూఢనమ్మకాలు అని నమ్మే హిందూ క్రియాకలాపాలలో నిజంగా కంటికి కన్పించని నిగూఢమైన ఆధ్యాత్మిక, మానసిక తత్వాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. మూఢనమ్మకాలనుకున్నా వీటివల్ల ఇతరులకు కలిగే హాని ఏమీ లేదు. చివరకు ఆధునిక మానవునికి విజ్ఞానం పైనా యంత్రాలపైనా ఉన్న ప్రగాఢ విశ్వాసం అన్నిటికన్న పెద్ద మూఢవిశ్వాసం కాదా? ఎందుకంటే మనిషికి అత్యావశ్యకమైన మనశ్శాంతిని ఇవ్వలేకుండా ఉన్నా వీటి మీద అతడు తన నమ్మకాన్ని కోల్పోలేదే..
సంకలనం: దయానందాత్మ స్వామి
క్రైస్తవుల హింసాకాండ |
- 🗡మధ్య యుగంలో లెక్కలేనంతమంది స్త్రీలను మంత్రగత్తెలన్న నెపంతో నిర్దయగా కాల్చి చంపారు క్రైస్తవులు.
- 🗡నేటికి కూడా పాశ్చాత్యులకు పదమూడు అంటే దురదృష్ణ సూచిక.
- 🗡పొరపాటున చొక్కాను తిరగవేసుకుంటే ఆ రోజు పనంతా "ఫట్' అని నమ్ముతారు.
- 🗡ఎంతో మంది ముసల్మానులు కంటికి కనిపించిన తొండలనన్నీ కొట్టి చంపటం అందరికీ తెలిసిన విషయమే.