- ➣ ఉత్తర్ ప్రదేశ్ లో గోవధ నిషేదిస్తూ ఆర్డినెన్సు తెచ్చిన యోగి సర్కార్..
- ➣ నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేలా కొత్త చట్టం రూపకల్పన..
గోవును వధిస్తే జైలు శిక్ష, జరిమానా...యూపీ సర్కారు ఆర్డినెన్స్ జారీ.
Jun 10 2020: లక్నో (ఉత్తర్ ప్రదేశ్): గోవును వధించిన వారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది.గోవును వధించిన వారికి మొదటిసారి నేరం చేస్తే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించాలని యూపీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసింది.
గోవును రెండోసారి వధిస్తే పదేళ్ల వరకు జైలు శిక్షతోపాు రూ.5లక్షల జరిమానా విధించాలని సర్కారు నిర్ణయించింది. గో వధ నివారణ చట్టం 2020 పేరిట యూపీలోని యోగిఆదిత్యనాథ్ సర్కారు ఈ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. యూపీ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించారు.