స్త్రీలను గౌరవించిన పురాణాలు
పురాణాల్లో ప్త్రీలకెంతో ఉన్నతన్థానం కనిపిస్తున్నది.
- 1. ఒక్క సీతకోసం శ్రీరామచంద్రుడు రావణాసురుని సర్పస్వము నాశనం చేశాడు.
- 2. సభలో అవమానింపబడిన డ్రౌపదిని ఓదార్చేందుకు పాండవులు జరిపిన మహాభారత సంగ్రామంలో కురువంశం మొత్తం బలయింది.
- 3. సతీదేవికి జరిగిన అవమానం భరించలేక పరమశివుడు దక్షయాగాన్ని విధ్వంసం చేశాడు.
ఈ సంఘటనలేగాక స్త్రీల గౌరవానికద్దం పట్టే మరికొన్ని ఉదాహరణలు: -
- ➣ మహావిష్ణువు లక్ష్మీపతిగ,
- ➣ శివుడు గౌరీపతిగ,
- ➣ శ్రీరామచంద్రుడు సీతాపతిగ పిలవబడుతున్నారు.
- ➣ అంతేగాక శ్రీరాముడు కౌసల్యానందనుడుగ,
- ➣ శ్రీకృష్ణుడు దేవకీసుతుడుగ,
- ➣ వినాయకుడు ఉమాసుతుడుగ,
- ➣ పాండవులు కుంతీపుత్రులుగ కీర్తింపబడుతున్నారు
ఇంకా చెప్పాలంటే.. పూజా సవయంలో లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణీ పురందరులు, సీతారాములు అనడం ద్వారా అయ్యగార్లతోపాటు అమ్మవార్లుకూడ పూజలందుకుంటున్నారు. అంటే తల్లిగా, భార్యగ స్త్రీమూర్తి లోకంలో మన్ననలను పొందుతోంది. మరో విశేషమేమంటే మనదేశంలో ఎక్కడాలేని విధంగా పూరి జగన్నాథక్షేత్రంలో బలరామ-శ్రీకృష్ణులతో సమానంగా తమ సోదరి సుభద్రాదేవి నేటికీ ఘనంగా పూజలందుకొంటున్నది.
ఈ విధంగా అన్ని రకాలుగ ధన్యురాలు స్త్రీమూర్తి. ఈ ఉదాహరణలన్నీ మహిళను మనం ఎలా గౌరవించాలో తెలియజేస్తున్నాయి. గనుకనే - "యత్ర నార్యస్తు పూజ్యస్తే రమస్తే తత్ర దేవతా" అని ఆర్యోక్తి.
కుడివైపున శ్రీకృష్ణుడు - మధ్యన సోదరి సుభద్రా దేవి - ఎడమ బలభద్రుడు |
ఈ విధంగా అన్ని రకాలుగ ధన్యురాలు స్త్రీమూర్తి. ఈ ఉదాహరణలన్నీ మహిళను మనం ఎలా గౌరవించాలో తెలియజేస్తున్నాయి. గనుకనే - "యత్ర నార్యస్తు పూజ్యస్తే రమస్తే తత్ర దేవతా" అని ఆర్యోక్తి.
రచన: పేరి సత్యనారాయణ శాస్త్రి
సంకలనం: డా. జనమద్ది రామకృష్ణ
సంకలనం: డా. జనమద్ది రామకృష్ణ