రామాయణాన్ని వక్రీకరించిన సప్తగిరి పత్రిక...మరో వివాదంలో టీటీడీ..
టీటీడీ మరో పెద్ద వివాదాన్నికి దారి తీసింది... శ్రీరాముల వారికి ఘోరమైన అవమానం చేసిన టీటీడీ...
శ్రీరాములు వారికి కుసుడు కొడుకు కాదు అన్ని సప్తగిరి మాస పత్రికల్లో ప్రచురించింది... హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్న టీటీడీ.
ఎవరో చిన్నపిల్లాడు కుశుడు రాముడి కొడుకు కాదని రాసిన పిచ్చికధను సప్తగిరి లాంటి ప్రతిష్ట కలిగిన పత్రికలో కనీసం ఏం రాశారో పరీక్ష కూడా చేయకుండా ప్రచురించడం అంటే #ttd కి రామాయణం గురించి మరోసారి తెలుసుకోవలసిన సమయం వచ్చిందని అర్ధం అవుతుంది..ఒకసారి మొత్తం సిబ్బందిని పునఃశ్చరణ తరగతులకు పంపించాలని ఛైర్మన్ గారికి విజ్ణప్తి..
బీజేపీ నిరసన:
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో నడుస్తున్నటువంటి ధార్మిక పత్రిక సప్తగిరి...!
నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ BJP-బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి |
నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ BJP-బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి |
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో నడుస్తున్నటువంటి ధార్మిక పత్రిక సప్తగిరి...!
ఏప్రిల్ మాసంలో ఎవరో 9వ తరగతి చదువుకున్న ఒక బాలుడు రాసిన వ్యాసాన్ని సప్తగిరి పేజీ 41లో ప్రచురించినటువంటి ప్రచురణలో మన కోట్లాదిమంది ఆరాధ్య దైవం శ్రీరామ ప్రభువుకు లవుడు ఒక్కడే కుమారుడు అని కుశుడు వాళ్మీకి మహర్షి సృష్టి అని చెప్పి అసత్య ప్రచారాలు ప్రచురించటం ఎంతవరకు సమంజసం...?
ఇది కోట్లాదిమంది శ్రీరామ భక్తుల మనోభావాలు గాయపడే విధంగా ,కించపరిచే విధంగా ఉన్నాయి. దీనికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి గారి ఆద్వర్యంలో కోదండ రామస్వామి ఆలయం ముందు నిరసన తెలియచేయటం జరిగింది . వెంటనే సప్తగిరి ఎడిటర్ ని ఉద్యోగం నుండి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ..శ్రీరామ భక్తుల మనోభావాలు కాపాడండి.