చిన్నారుల అసభ్య చిత్రాలను, వీడియోలను డౌన్లోడ్ చేసిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వేదాంత శాస్త్ర ప్రొఫెసర్, మాజీ పాస్టర్ జాన్ జూస్టన్‌కు ఫ్రాన్స్ కోర్డు ఏడాది జైలుశిక్ష విధించింది. అలాగే ఫ్రాన్స్‌లోని లైంగిక నేరస్థుల రిజిస్టర్లో ఈయన పేరును నమోదుచేశారు. 27 వేలకు పైగా బాలల అసభ్య చిత్రాలు, 1000 కిపైగా వీడియోలను డౌన్లోడ్ చేసినట్లు జూస్టన్పై ఆరపణలు నమోదయ్యాయి.
ఆక్స్‌ఫర్డ్‌లోని ప్రతిష్ఠాత్మక హిబ్రూ రెజియస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 61 ఏండ్ల జాన్ జూస్టన్ ను విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్, క్రైస్ట్ చర్చి కళాశాల వారు సోమవారం రాత్రి అతన్ని అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేశారు. ఈయన తన తరం యొక్క అత్యంత విశిష్టమైన బైబిల్ పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఫ్రాన్స్‌లోని బాస్-రిన్ ప్రాంతంలో నివసిస్తున్న ఈ విద్యావేత్త సుమారు 27,000 చిత్రాలు మరియు 1,000 వీడియోలను కలిగి ఉన్నారు. ఈయనకు సావర్న్ నగరంలో కోర్టు గత వారం శిక్ష విధించింది. తన స్వదేశమైన బెల్జియంలో పాస్టర్‌గా ఆరు సంవత్సరాలు గడిపిన జూస్టన్.. డౌన్లోడ్ చేసిన వాటిలో ఎక్కువగా బాలల లైంగిక వేధింపుల చిత్రాలు ఉన్నాయని న్యాయవాదులు తెలిపారు. ఆరేండ్ల కాలంలో డౌన్లోడ్ చేయబడిన ఈ చిత్రాలను స్ట్రాస్‌బోర్గ్‌లోని సైబర్ క్రైమ్ నిపుణులు సుదీర్ఘ పోలీసు దర్యాప్తు ద్వారా కనుగొన్నారు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన జూస్టన్ ఈ కేసులోని వాస్తవాలను అంగీకరించి, అరెస్టును తప్పించుకున్నాడు.
Source : Namasthetelangaana