ఇన్ ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధ ఆహార యాంటీ బయోటిక్స్
మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు బ్యక్టీరియా,వైరస్ ఇన్ ఫెక్షన్ ల వల్ల కలుగుతాయి.వీటితో శరీరంలోరోగనిరోధక శక్తి తగ్గిపోయి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటుంటాము.మనకు అందుబాటులోనే ఉండే పదార్థాలతో ఈ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా ఎదుర్కొనవచ్చు.
- 1. క్రాన్ బెర్రీ జ్యూస్ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా తగ్గిస్తుంది.మూత్రాశయ , వెజైనల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.తాజా జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవాలి.రోజుకి రెండు , మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.ఇన్ ఫెక్షన్స్ తో బాధపడే గర్భిణీ స్త్రీలు కూడా తాగవచ్చు.
- 2. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ వైరల్ ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇవి బ్యాక్టీరియా,వైరస్లను సమర్థంగా నిర్మూలిస్తాయి.టీ ట్రీ ఆయిలో కలబంద గుజ్జును బాగా కలిపి చర్మం మీద రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.
- 3. కలబందలో యాంటీ ఇంఫమ్మేటరీ ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి.ఇన్ ఫెక్షన్ లను తగ్గించి,చర్మం పాడవకుండా చూసి,వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- 4. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్,యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఇన్ ఫెక్షన్ లనుండి సమర్థంగా రక్షిస్తుంది.రోజూ ఏదో విధంగా 4 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను తింటుంటే మంచి ఫలితం కనబడుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- 5. తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలు అధికంగానే ఉన్నాయి.ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ తేనెను కలిపి రోజూ తీసుకుంటే ఇన్ ఫెక్షన్ లను దూరం చేసుకోవచ్చు.తేనెను నేరుగా చర్మం పై రాసినా చర్మ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.తేనెవల్ల చెడు బ్యాక్టీరియా,చెడు వైరస్ లు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.
- 6. జీర్ణాశయం,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను అల్లం మెరుగ్గా తగ్గిస్తుంది.ఆయా సమస్యలు ఉన్నపుడు కొద్దిగా అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది.శరీరంలోని వేడిని ఇట్టే తగ్గిస్తుంది.రక్త సరఫరా మెరుగు పరుస్తుంది.శరీరంలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.
- 7. బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు బాగా కలవు.జీర్ణాశయం,పేగులు,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను బేకింగ్ సోడా తగ్గిస్తుంది.ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
- 8. సహజ్ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలకు నిమ్మ రసం పెట్టింది పేరు.శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ లను మెరుగ్గా నయం చేస్తుంది.చెడు వైరస్,బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.విటమిన్ సి ఉండడం వల్ల ఇవి నశిస్తాయి.ఉబ్బసం / ఆస్త్మా వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.కాలేయం శుభ్రపడుతుంది.
- 9. రోజూ మనం వంటలో వాడే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.యాంటీ వైరల్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇంఫ్లమ్మేటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు పసుపు పెట్టింది పేరు.గాయాలపై పసుపు రాస్తే వెంటనే తగ్గిపోతాయి.యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయం త్వరగా మానుతుంది.శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పసుపును పాలలో కలిపి తీసుకోవాలి.జీర్ణాశయ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీటితో కలిపి దీనిని తీసుకోవాలి.ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.
- 10. యాపిల్ సిడార్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ ఫెక్టివ్ గుణాలు అధికంగా ఉన్నాయి.శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా ,వైరస్ లను ఇది నిర్మూలిస్తుంది.చర్మాన్ని రక్షిస్తుంది.జీర్త్ణాశయ ఇన్ ఫెక్షన్ లను పోగొడుతుంది.
సంకలనం: కోటేశ్వర్