కరోనా పై పోరాటంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రపంచమంతా శ్లాఘిస్తున్నా, మరుగుజ్జ మనస్తత్వం కల్గిన కొందరు ( T V చానళ్శకు గుత్తగా కాంట్రాక్టు) మేధావులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో శ్రమ పడుతున్నారు. వారి శ్రమ చూస్తే జాలి , అసహ్యం పుడుతున్నాయి.
- ➣ Lock Down ముందు అన్ని రాష్ట్రాల ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరిపినా ఏకపక్ష నిర్ణయం అంటూ రేకుడబ్బా పదే పదే మోగిస్తున్నారు.
- ➣ అయినా మన ముఖ్యమంత్రులు స్థానిక ఎత్తుగడలకు , ప్రజా ధనం దోపిడీకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ కరోనాపై పెట్టినారా? లేదనటానికి బోలెడన్ని ఉదాహరణలు. ప్రాంతీయ పార్టీలు ఉన్నచోట మరీ దారుణం.
- ➣ కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్ లేదా తబ్లిగిపై లోతుగా చర్చించటానికి ఎవరికీ నిజాయితీ లేదు, దమ్ము లేదు.
- ➣ బైంసాలో నిరపరాధులపై ఆక్రమణ, భీభత్సం జరిగితే సరైన వార్తా సమీక్ష చేయలేని బలహీనులు మన మేథావులు.
- ➣ వీళ్ళు – కరోనాపై జాగ్రత్తల విషయంలో ఒక్క మంచి ప్రోగ్రాం ఇవ్వలేదు. పైగా చేసేవన్నీ తప్పుల తడకల విశ్లేషణలు .
- ➣ ప్రజలు ప్రాణాలగురించి ఆలోచిస్తుంటే – ఆర్ధికమాంద్యం గురించి మాట్లాడతారు.
- ➣ ఆర్ధికపరమైన వెసులుబాటు గురించి మాట్లాడితే – మౌళిక సదుపాయాల గూర్చి మాట్లాడతారు. అంటే ప్రజలను అయోమయంలో పెట్టడమే వీరి లక్ష్యం .
- ➣ Lock Down తరువాత కూడా ఒక సంవత్సరం వరకూ మరణాలు తగ్గినా కరోనా కేసులు మాత్రం ఉంటాయని, కరోనా కేసులు పెరుగుతాయని నిర్లక్ష్యం తగదని సాంకేతిక నిపుణులు అందరూ హెచ్చరిస్తూనే ఉన్నారు.
- ➣ ఇక తెలుగు రాష్ట్రాలలో మైనారిటీలు బహుళంగా నివసించే ప్రాంతాల్లో ఏ జాగ్రత్తలూ లేవు. కనీసం ఆ ప్రాంతాలలోకి అధికారులకు, పోలీసువారికి ప్రవేశం కూడా లేదు . కేంద్ర పరిశీలక బృందం ఇచ్చిన వివరణను ఈ మేధావులు చదివి విశ్లేషించాలి కదా? దానికి ఎవరు అడ్డుపడ్డారో పెరుమాళ్ళకెరుక!
- ➣ అన్నీ తెలిసిన ప్రొఫెసర్ కు 3 చోట్ల అంటినట్లు, ఒకాయనకు ఇంకా కేసులు తగ్గవేమో ? Curve – Flet కాలేదు కదా? అని పదే పదే విమర్శస్తూ మనదేశాన్ని – ఏ దేశాలతో పోల్చాలో – కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఊదర కొడుతున్నారు.
- ➣ అయ్యా – మేధావులూ కష్టసమయంలో ప్రజలకు మంచి సలహాలు ఇచ్చి మనోబలాన్ని నిలబెట్టాలి గాని చౌకబారు విమర్శలతో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.
- ➣ గుడ్డిగా మానవహక్కుల, (ప్రాధమిక హక్కుల ) పేరుతో విద్రోహకర శక్తులకు బాసటగా ఉంచే ప్రజలు క్షమించరు సుమా !
ఇప్పటి కైనా సరైన పద్ధతిలో విమర్శ – సహేతుకమైన ఆలోచనలో నడవండి – నడిపించండి- లేదంటే మీరు కూడా కరపత్రాలుగా మారిన దిన పత్రికల మాదిరి మిగిలి పోతారు సుమా…….
– మురళీ రవం
మూలము: విశ్వ సంవాద కేంద్రము