- • ప్రశ్నించినవారిపై ఎస్సీ ఎస్టీ కేసుల పేరిట బెదిరింపులు
- • పాస్టర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలని ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
ఆంధ్రప్రదేశ్: ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు పూజించుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నమూనాను స్థానిక పాస్టర్ తొలగించివేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
గ్రామస్థుల కధనం ప్రకారం.. గోకవరం మండలంలోని మారుమూల ఇటిక్యాలపల్లి గ్రామంలోని ఓ గుట్టపై ఎన్నో ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముద్రలు ఉన్నాయి. గ్రామ ప్రజలు ఆ గుట్టని పుణ్యక్షేత్రంగా భవిస్తూ వాటిని కొలుస్తుంటారు. ఇటీవల స్థానికంగా ఉన్న మరో పోతవరం అనే మరో గ్రామానికి చెందిన క్రైస్తవ పాస్టర్ గుల్లా ఏడుకొండలు గుట్ట ఉన్న పాదాలను పూర్తిగా తొలగించివేసి, వాటి స్థానంలో యేసుక్రీస్తు విగ్రహం ఏర్పాటు చేశాడు.
ఈ చర్యను గమనించి ప్రశ్నించిన తమపై ఎస్టీ ఎస్సీ చట్టం కింద కేసు పెడతానని బెదిరించడంతో పాటు, హిందూ దేవీదేవతలను నీచంగా అవమానిస్తూ అవహేళన చేస్తున్నాడంటూ గ్రామస్తులు పేర్కొన్నారు.
ఇదే విషయమై ఇటిక్యాలపల్లి వాసులు స్థానిక హిందూ సంఘాల సహాయంతో గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఆ పాస్టర్ క్రైస్తవుడి అయినందున, చట్టప్రకారం అతడి ఎస్సీ కులధ్రువీకరణ పత్రం రద్దు చేయాల్సిందిగా గోకవరం మండల ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.
__విశ్వ సంవాద కేంద్రము