కెన్యాలో హిందూ ధార్మిక సంఘాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో రిజిస్టర్ చేసుకున్న సంఘాలు 150. వేలాదిమంది ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారంతా హిందూ ధర్మ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం ఇస్తున్నారు. ఆ నేలలో మన కుటుంబ విలువలను పూయిస్తున్నారు. ఆ మట్టిలో మన వివాహ వ్యవస్థను నెలకొల్పుతున్నారు. ఆ సమాజంలో మన శ్లోకాలను బీజాక్షరాలుగా నాటుతున్నారు. మచిలీపట్నం మహిళ కోటంరాజు సుజాత 'జాగృతి'తో పంచుకున్న అనుభవాలివి.
అక్కడ ఆమె.
కోటం రాజు సుజాత పుట్టింది పెరిగింది మచిలీపట్నంలో, భర్త ఉద్యోగరీత్యా 1992లో కెన్యాకు వెళ్లారు. కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత భర్త వ్యాపార నిర్వహణలో భాగస్వామి అయ్యారు అనాథ శరణాయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి బాధితుల శరణాలయాలకు హిందూ ధార్మిక సంస్థల ద్వారా సహాయం చేస్తుంటారు. ఈ జనవరిలో జర్మనీలో జరిగిన ప్రపంచ శాంతి సదస్సుకు కెన్యా ప్రతినిధిగా హాజరయ్యారు.
కానీ వందేళ్ల కిందట మన తెలుగు గ్రామాల నుంచి ఎన్నో కుటుంబాలు కెన్యాకు వలస వెళ్లాయి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకనే ప్రయాణమయ్యారు. అక్కడ పని దొరుకుతుందని మాత్రమే వాళ్లకు తెలిసింది. అప్పట్లో మన భారతదేశంతోపాటు కెన్యా కూడా బ్రిటిష్ వలస పాలనలోనే ఉండేది. బ్రిటిష్ వాళ్లు అక్కడ పని చేయడానికి కూలీలను షిప్పల్లో ఎక్కించుకుని వెళ్లారు. ఆ రకంగా కెన్యా దేశ నిర్మాణంలో మన భారతీయుల శ్రమ ఉంది. ఆ నేలలో ఇంకిపోయిన మనవాళ్ల చెమట చుక్కలు ఇప్పటికీ సంస్కృతి పరిరక్షణ రూపంలో అక్కడ పరిఢవిల్లుతూనే ఉన్నాయి.
ఆలయ నిలయం:
మనదేశం నుంచి కెన్యాకు వెళ్లిన తొలితరాన్ని ఇప్పుడు మనం అక్కడ చూడలేం. కానీ ఆ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందిన వాళ్ల సంతతిని చూడగలం వాళ్లందరూ ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో కలుస్తారు. సంఘటితం కావడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. వారందరినీ కలుపుతున్న అందమైన బంధం మన భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు అక్కడ వాళ్ల రోజువారీ జీవితంలో భాగంగా ఉన్నాయి.
హిందూ సంప్రదాయాలు ఆఫ్రికా జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయి కూడా. ఆ సమాజాన్ని తీర్చిదిద్దడంలో మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయి. అక్కడ హిందూ సంప్రదాయం సంస్కృతిని అక్కడి ఆలయాలే చెబుతాయి.
నైరోబీ నగరంలో హిందూ ఆలయాలు వీధికొకటి ఉంటాయి.
హరేకష్ణ రథయాత్ర:
కెన్యాలో ప్రధాన మతం క్రైస్తవం. ఇక్కడి చర్చిల్లో చాలా రకాలుంటాయి. రోమన్ కాథలిక్ చర్చ్, బాప్టిస్ట్, ప్రొటెస్టెంట్లే కాకుండా అనేక రకాల చర్చిలు ఉంటాయి. కెన్యా ప్రజలు శాంతి కాముకులు. ఇతర మతాలను ఆదరిస్తారు, ఆ మతస్తుల విశ్వాసాలను గౌరవిస్తారు. హరే రామ హరే కష్ట రథయాత్ర నైరోబీలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో హిందువులతోపాటు స్థానికులు (ఆఫ్రికన్ జాతీయులు) కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
స్థానిక కెన్యా ఆఫ్రికన్ జాతీయుల్లో చాలామంది హరే రామ హరేకష్ణ భక్తులు ఉన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం స్థానిక ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తుంది రోడ్డు మీద కార్పెట్ పరిచి మరీ రథయాత్రను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ దేశంలో హిందూ ఆలయాలు, క్రిస్టియన్ చర్చిలు విశేషంగా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. వీటితోపాటు మసీదులు, బౌద్ధ- జైన మందిరాలు, బహాయీ ప్రార్థన మందిరాలు కూడా ఉన్నాయి.
ఆహార విహారాలు:
దాదాపుగా వంద ఏళ్ల నుంచి మనవాళ్లు ఆ గడ్డ మీద మనుగడ సాగిస్తున్నారు. వారిలో గుజరాతీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కెన్యాలో అడుగు పెట్టి మూడు తరాలు దాటుతున్నప్పటికీ వాళ్లు ఇప్పటికీ వాళ్ల ఆహార విహారాల్లో ఎటువంటి మార్పును రానివ్వడం లేదు. వాళ్లను చూస్తుంటే మనదేశంలో గుజరాత్లో పర్యటిస్తున్నట్లే ఉంటుంది. వారి ప్రధాన ఉపాధి మార్గం వ్యాపారమే. ఇంట్లో పూజ చేసుకుని, సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి, నుదుట బొట్టు దిద్దుకుని దుకాణంలో అడుగుపెడతారు. మన తెలుగు వాళ్లు మార్పును త్వరగా స్వీకరిస్తారు. మొదటి రెండేళ్లు భారతీయతకు ప్రతిరూపాలుగా కనిపిస్తుంటారు. కానీ ఆ తర్వాత మెల్లగా మారిపోతుంటారు. అందుకు కారణం మన వాళ్ల ఉపాధి ఉద్యోగం కావడం కూడా కావచ్చు.
ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లినప్పుడు అక్కడ నిత్యం ప్రపంచ దేశాల మనుషులతో కలుస్తూ ఉంటారు. దాంతో క్రమంగా వస్త్రధారణలో మార్పు వస్తుంది. మగవాళ్ల విషయానికి వస్తే ధోవతులు ధరించడం భారతదేశంలోనే మానేశారు. ప్యాంటు షర్టులే సంప్రదాయ దుస్తులన్నంతగా పాశ్చాత్యీకరణ చెందిపోయారు. కాబట్టి మగవాళ్లలో కెన్యాకు వెళ్లిన తర్వాత వచ్చే మార్పేమీ ఉండదు.
కెన్యాలో నివసిస్తున్న ఈ తరం గుజరాతీ యువతులు మాత్రం పాశ్చాత్యీకరణ చెందారనే చెప్పాలి. అయితే పండుగ పర్వదినాల్లో సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తారు. భారతీయులు తమ ఆహారంలో మాత్రం ఎటువంటి మార్పులకూ తావివ్వలేదు. భారతదేశంలో నివసిస్తున్న వాళ్లు మెక్డీలు, సబ్ వేలలో ఆకలి తీర్చుకోవడాన్ని చూస్తున్నాం. కానీ కెన్యాలో ఉన్న భారతీయులు మన వంటగదిని, పోపుల పెట్టెను కూడా ఆ దేశానికి పట్టు కెళ్లిపోయారా అనిపిస్తుంది. అవేకాదు...పెరటితోటను కూడా అక్కడ ప్రతిష్ట చేశారు. బచ్చలి, కాకర తీగలను, నేరేడు వంటి చెట్లు హిందువుల ఇంటి పెరళ్లలో పెరుగుతున్నాయి. వాళ్ల వంటల్లో ఉడుకుతున్నాయి.
సంగీతకారులు వారి వారి సంప్రదాయ సంగీతకచేరీలు నిర్వహించారు, పిల్లలు శ్లోకాలు చదివారు, వేదాలు వల్లించారు. పెళ్లి కూతురిని అలంకరించి బుట్టలో పెట్టి పెళ్లి పీటల మీదకు తీసుకురావడమనే సంప్రదాయాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు రోజుల కార్యక్రమాలలో ఎనిమిది వందల మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కెన్యాలో ఉన్న భారత హై కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు కూడా హాజరయ్యారు. ఆసక్తి కలిగించే మరో విషయం ఏమిటంటే... ఈ కార్యక్రమాలను రిబ్బన్ కత్తిరించడంతో ప్రారంభించలేదు. గుజరాత్ సంప్రదాయంలో ఆచరణలో ఉన్న ముడివిప్పడం అనే క్రతువుని పాటించారు. ముడివేసి ఉంచిన రెండు తాళ్ల ముడివిప్పడం అక్కడ ప్రారంభ సూచన.
ఇక కార్యక్రమానికి హాజరైన వాళ్లు నిర్వహకుల అలంకరణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడవాళ్లు, పిల్లలు ఎవరి రాష్ట్ర సంప్రదాయం ప్రకారం వాళ్లు పట్టు చిరలు, వడ్డాణాలు, చేతులకు వంకీలు, తలలో సూర్యచంద్రికలను అలంకరించుకుని వేదికకు, వేడుకకు కళ పెంచారు.
మన కుటుంబ విలువలు:
మే నెల 30వ తేదీన నైరోబీలో మన కుటుంబ విలువల గురించి చర్చించడం కోసమే ఒక సదస్సు జరిగింది. హిందూ కుటుంబ వ్యవస్థ, జీవనశైలిలో పాటించే విలువలు, కుటుంబ విలువల గురించి, మన తెలుగింటి ఆడపడుచు కోటంరాజు సుజాత ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ దేశ ప్రథమ పౌరురాలు మార్గరెట్ కెన్యాట్టా హాజరయ్యారు. కెన్యా వాళ్లకు భారతీయ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థల మీద అపారమైన నమ్మకం. ఒక స్త్రీ- పురుషులను వివాహ బంధంతో దంపతులుగా చేయడం, ఆ దాంపత్యం కలకాలం కొనసాగడం మీద వారికి గౌరవం. పెళ్లిని పెద్దవాళ్లు నిర్ణయించడం వారికి అంతటి దైవభావం అనేది అక్కడి వాళ్లకు ఒక విచిత్రం. అందుకే మన భారతీయ, హిందూ జీవనశైలి పట్ల వారికీ అంతటి దైవభావం.
హిందువులు పరస్పరం కలిసే సందర్భాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ దేశంలో వారాంతపు వేడుకల సంస్కృతి బాగా ఎక్కువ. ఆ సంస్కృతిని మనవాళ్లు హిందూ సత్సంగ సదస్సులుగా మార్చుకుంటున్నారు. శని, ఆదివారాల్లో దేవుడి గుళ్లలో సత్సంగం ఏర్పాటు చేసుకుంటారు. ఆ రెండు రోజులూ దేవుడి ప్రసాదాలే భోజనాలు. అలా ఒక్కోవారం ఒక్కొక్క గుడిలో సత్సంగ వేదికగా కార్యక్రమాలు ఉంటాయి.
కెన్యాలో ఉన్న హిందువులను చూసినప్పుడు 'మనసు ఉండాలే కానీ మార్గం ఉండకపోతుందా' అనే నానుడి నిజం అనిపిస్తుంది. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా.. నిలుపరా నీ జాతి నిండు గౌరవం... పొగడరా నీ భూమి భారతిని. జై హింద్. జై భారత్..
వ్యాసకర్త : సీనియర్ ఇర్నలిస్ట్
మూలము: జాగృతి
మచిలీపట్నం మహిళ కోటంరాజు సుజాత |
కోటం రాజు సుజాత పుట్టింది పెరిగింది మచిలీపట్నంలో, భర్త ఉద్యోగరీత్యా 1992లో కెన్యాకు వెళ్లారు. కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత భర్త వ్యాపార నిర్వహణలో భాగస్వామి అయ్యారు అనాథ శరణాయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి బాధితుల శరణాలయాలకు హిందూ ధార్మిక సంస్థల ద్వారా సహాయం చేస్తుంటారు. ఈ జనవరిలో జర్మనీలో జరిగిన ప్రపంచ శాంతి సదస్సుకు కెన్యా ప్రతినిధిగా హాజరయ్యారు.
- ➧ ఇంటర్ రిలిజియస్ కౌన్సిల్ సభ్యురాలు.
- ➧ ఆఫ్రికన్ ఉమెన్ ఫెయిత్ నెట్వర్క్ సభ్యురాలు.
- ➧ సత్యసాయి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్.
- ➧ హెల్త్‌కేర్ సంస్థలో ట్రెజర్. కెన్యాలో ఉన్న 150 హిందూ ధార్మిక సంస్థల సమాఖ్యకు జాతీయ కార్యదర్శి.
- ➧ లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు.
- ➧ యాంటీ కరప్షన్ వింగ్ స్లీరింగ్ కమిటీ సభ్యురాలు.
కానీ వందేళ్ల కిందట మన తెలుగు గ్రామాల నుంచి ఎన్నో కుటుంబాలు కెన్యాకు వలస వెళ్లాయి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకనే ప్రయాణమయ్యారు. అక్కడ పని దొరుకుతుందని మాత్రమే వాళ్లకు తెలిసింది. అప్పట్లో మన భారతదేశంతోపాటు కెన్యా కూడా బ్రిటిష్ వలస పాలనలోనే ఉండేది. బ్రిటిష్ వాళ్లు అక్కడ పని చేయడానికి కూలీలను షిప్పల్లో ఎక్కించుకుని వెళ్లారు. ఆ రకంగా కెన్యా దేశ నిర్మాణంలో మన భారతీయుల శ్రమ ఉంది. ఆ నేలలో ఇంకిపోయిన మనవాళ్ల చెమట చుక్కలు ఇప్పటికీ సంస్కృతి పరిరక్షణ రూపంలో అక్కడ పరిఢవిల్లుతూనే ఉన్నాయి.
ఆలయ నిలయం:
మనదేశం నుంచి కెన్యాకు వెళ్లిన తొలితరాన్ని ఇప్పుడు మనం అక్కడ చూడలేం. కానీ ఆ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందిన వాళ్ల సంతతిని చూడగలం వాళ్లందరూ ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో కలుస్తారు. సంఘటితం కావడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. వారందరినీ కలుపుతున్న అందమైన బంధం మన భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు అక్కడ వాళ్ల రోజువారీ జీవితంలో భాగంగా ఉన్నాయి.
హిందూ సంప్రదాయాలు ఆఫ్రికా జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయి కూడా. ఆ సమాజాన్ని తీర్చిదిద్దడంలో మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయి. అక్కడ హిందూ సంప్రదాయం సంస్కృతిని అక్కడి ఆలయాలే చెబుతాయి.
నైరోబీ నగరంలో హిందూ ఆలయాలు వీధికొకటి ఉంటాయి.
- ➧ గుజరాత్ వాళ్లు కట్టిన స్వామి నారాయణ్ ఆలయాలకు లెక్కే లేదు.
- ➧ శ్రీ సనాతన ధర్మ ఆలయం (ఎస్ఎస్ డి)లో శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు పూజలందుకుంటున్నారు.
- ➧ ఇవి కాక అయ్యప్ప దేవాలయం, మురుగన్ కోవెల, రామమందిరం కల్యాణ వేంకటేశ్వరాలయం, మంగళ్ మందిర్హ నుమాన్ ఆలయం కూడా ఉన్నాయి.
- ➧ గురు ద్వారాలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నాయి.
దసరా బ్రహ్మోత్సవాలు:
దసరా సందర్భంగా మన తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు జరిగినట్లే నైరోబీలో ఉన్న మనవాళ్లు కూడా బ్రహ్మోత్సవాలు చేసుకుంటారు. ఉదయం సాయంత్రం వాహన సేవలు తిరుమలలో ఎలా చేస్తారో అదేవిధంగా నిర్వహించుకుంటారు. ఈ పవిత్రోత్సవాలను వేద మంత్రోచ్ఛారణలతో నిర్వహించడానికి తిరుమల నుంచి టీటీడీ పూజారులు వెళ్తారు. తిరుమలలో శ్రీవారికి నైవేద్యాలు వండే వంట వాళ్లను తీసుకెళ్తారు. బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో శ్రీవారికి ఏ రోజు ఏ వంటకాలను నివేదన చేస్తారో అదే రకంగా వంటలు చేసి పవిత్ర మనసులతో దేవునికి నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో నగరంలో ఉన్న హిందువులందరూ హాజరవుతారు. నవరాత్రి ఉత్పవాలు కూడా అంతే వేడుకగా జరుగుతాయి. రాత్రి పూజలు పూర్తయినప్పటి నుంచి తెల్లవారి మూడు గంటల వరకు సందడిగా దాండియా, గర్భా నాట్యాలు చేస్తారు.హరేకష్ణ రథయాత్ర |
కెన్యాలో ప్రధాన మతం క్రైస్తవం. ఇక్కడి చర్చిల్లో చాలా రకాలుంటాయి. రోమన్ కాథలిక్ చర్చ్, బాప్టిస్ట్, ప్రొటెస్టెంట్లే కాకుండా అనేక రకాల చర్చిలు ఉంటాయి. కెన్యా ప్రజలు శాంతి కాముకులు. ఇతర మతాలను ఆదరిస్తారు, ఆ మతస్తుల విశ్వాసాలను గౌరవిస్తారు. హరే రామ హరే కష్ట రథయాత్ర నైరోబీలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో హిందువులతోపాటు స్థానికులు (ఆఫ్రికన్ జాతీయులు) కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
స్థానిక కెన్యా ఆఫ్రికన్ జాతీయుల్లో చాలామంది హరే రామ హరేకష్ణ భక్తులు ఉన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం స్థానిక ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తుంది రోడ్డు మీద కార్పెట్ పరిచి మరీ రథయాత్రను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ దేశంలో హిందూ ఆలయాలు, క్రిస్టియన్ చర్చిలు విశేషంగా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. వీటితోపాటు మసీదులు, బౌద్ధ- జైన మందిరాలు, బహాయీ ప్రార్థన మందిరాలు కూడా ఉన్నాయి.
ఆహార విహారాలు:
దాదాపుగా వంద ఏళ్ల నుంచి మనవాళ్లు ఆ గడ్డ మీద మనుగడ సాగిస్తున్నారు. వారిలో గుజరాతీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కెన్యాలో అడుగు పెట్టి మూడు తరాలు దాటుతున్నప్పటికీ వాళ్లు ఇప్పటికీ వాళ్ల ఆహార విహారాల్లో ఎటువంటి మార్పును రానివ్వడం లేదు. వాళ్లను చూస్తుంటే మనదేశంలో గుజరాత్లో పర్యటిస్తున్నట్లే ఉంటుంది. వారి ప్రధాన ఉపాధి మార్గం వ్యాపారమే. ఇంట్లో పూజ చేసుకుని, సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి, నుదుట బొట్టు దిద్దుకుని దుకాణంలో అడుగుపెడతారు. మన తెలుగు వాళ్లు మార్పును త్వరగా స్వీకరిస్తారు. మొదటి రెండేళ్లు భారతీయతకు ప్రతిరూపాలుగా కనిపిస్తుంటారు. కానీ ఆ తర్వాత మెల్లగా మారిపోతుంటారు. అందుకు కారణం మన వాళ్ల ఉపాధి ఉద్యోగం కావడం కూడా కావచ్చు.
ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లినప్పుడు అక్కడ నిత్యం ప్రపంచ దేశాల మనుషులతో కలుస్తూ ఉంటారు. దాంతో క్రమంగా వస్త్రధారణలో మార్పు వస్తుంది. మగవాళ్ల విషయానికి వస్తే ధోవతులు ధరించడం భారతదేశంలోనే మానేశారు. ప్యాంటు షర్టులే సంప్రదాయ దుస్తులన్నంతగా పాశ్చాత్యీకరణ చెందిపోయారు. కాబట్టి మగవాళ్లలో కెన్యాకు వెళ్లిన తర్వాత వచ్చే మార్పేమీ ఉండదు.
కెన్యాలో నివసిస్తున్న ఈ తరం గుజరాతీ యువతులు మాత్రం పాశ్చాత్యీకరణ చెందారనే చెప్పాలి. అయితే పండుగ పర్వదినాల్లో సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తారు. భారతీయులు తమ ఆహారంలో మాత్రం ఎటువంటి మార్పులకూ తావివ్వలేదు. భారతదేశంలో నివసిస్తున్న వాళ్లు మెక్డీలు, సబ్ వేలలో ఆకలి తీర్చుకోవడాన్ని చూస్తున్నాం. కానీ కెన్యాలో ఉన్న భారతీయులు మన వంటగదిని, పోపుల పెట్టెను కూడా ఆ దేశానికి పట్టు కెళ్లిపోయారా అనిపిస్తుంది. అవేకాదు...పెరటితోటను కూడా అక్కడ ప్రతిష్ట చేశారు. బచ్చలి, కాకర తీగలను, నేరేడు వంటి చెట్లు హిందువుల ఇంటి పెరళ్లలో పెరుగుతున్నాయి. వాళ్ల వంటల్లో ఉడుకుతున్నాయి.
సాంస్కృతిక్ మహోత్సవ్
ఈ ఏడాది జనవరి 25,26 తేదీల్లో నైరోబీలో సాంస్కృతిక్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెన్యాలో ఉన్న హిందువులు పదివేల మంది హాజరయ్యారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించడానికి వంద స్టాల్స్ ఏర్పాటు చేశారు. మన తెలుగు వాళ్ల కూచిపూడి, తమిళ భరతనాట్యం నుంచి కథక్, కథకళి, ఒడిస్సీ, ఉత్తరాది నాట్యరీతులు, ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక నాట్యాలను ప్రదర్శించారు.పిల్లలు |
ఇక కార్యక్రమానికి హాజరైన వాళ్లు నిర్వహకుల అలంకరణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడవాళ్లు, పిల్లలు ఎవరి రాష్ట్ర సంప్రదాయం ప్రకారం వాళ్లు పట్టు చిరలు, వడ్డాణాలు, చేతులకు వంకీలు, తలలో సూర్యచంద్రికలను అలంకరించుకుని వేదికకు, వేడుకకు కళ పెంచారు.
మన కుటుంబ విలువలు:
మే నెల 30వ తేదీన నైరోబీలో మన కుటుంబ విలువల గురించి చర్చించడం కోసమే ఒక సదస్సు జరిగింది. హిందూ కుటుంబ వ్యవస్థ, జీవనశైలిలో పాటించే విలువలు, కుటుంబ విలువల గురించి, మన తెలుగింటి ఆడపడుచు కోటంరాజు సుజాత ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ దేశ ప్రథమ పౌరురాలు మార్గరెట్ కెన్యాట్టా హాజరయ్యారు. కెన్యా వాళ్లకు భారతీయ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థల మీద అపారమైన నమ్మకం. ఒక స్త్రీ- పురుషులను వివాహ బంధంతో దంపతులుగా చేయడం, ఆ దాంపత్యం కలకాలం కొనసాగడం మీద వారికి గౌరవం. పెళ్లిని పెద్దవాళ్లు నిర్ణయించడం వారికి అంతటి దైవభావం అనేది అక్కడి వాళ్లకు ఒక విచిత్రం. అందుకే మన భారతీయ, హిందూ జీవనశైలి పట్ల వారికీ అంతటి దైవభావం.
ఇంటి ముందు ముగ్గు:
కెన్యాలో భారతీయుల హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో మనకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే... వాళ్లు రోజూ ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసుకుని, నీళ్లు చల్లి, ముగ్గు పెట్టుకుంటున్నారు. మనవాళ్లు రోజూ ముగ్గు పెట్టుకుంటున్న వైనాన్ని చూసి స్థానిక ఆఫ్రికన్లు కూడా ఆసక్తి కొద్దీ నేర్చుకుంటున్నారు. కెన్యా సంపన్న దేశం ఏమీకాదు, అయినా ప్రశాంతంగా జీవించే వాతావరణం ఆ దేశం సొంతం. ఉద్యోగం వ్యాపారాల కారణంగా ఆ దేశంలో ఒకసారి అడుగు పెట్టిన వాళ్లు మళ్లీ వెనక్కి తిరిగి చూడరు.హిందువులు పరస్పరం కలిసే సందర్భాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ దేశంలో వారాంతపు వేడుకల సంస్కృతి బాగా ఎక్కువ. ఆ సంస్కృతిని మనవాళ్లు హిందూ సత్సంగ సదస్సులుగా మార్చుకుంటున్నారు. శని, ఆదివారాల్లో దేవుడి గుళ్లలో సత్సంగం ఏర్పాటు చేసుకుంటారు. ఆ రెండు రోజులూ దేవుడి ప్రసాదాలే భోజనాలు. అలా ఒక్కోవారం ఒక్కొక్క గుడిలో సత్సంగ వేదికగా కార్యక్రమాలు ఉంటాయి.