"భూమి" బల్ల పరుపుగా ఉన్నది. గుండ్రముగా ఉన్నదంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా మత గ్రంథంలో అలాగే ఉంది" అని అడ్డంగా వాదించే క్రైస్తవ పండితుల గురించి మనకు తెలుసు. "కపిద్ధాకార భూగోళం అని మూర్ఖులు వాదిస్తారు" అని అంటారు వీరు. యోగాసనాల మీద వీరు చేసిన హేళనలలో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నారో చూడండి.
రోమన్ కాథలిక్ మతానికి సర్వాధికారి అయిన వాటికన్ వ్యవస్థలోని ప్రముఖుడు గాబ్రియేలు అమోర్ద్ అంటాడు కదా! "ప్రాచీన కాలం నుండి హిందువులు చేసే అన్ని యోగ ప్రక్రియలు, ఆసనాలు మొదలైనవన్నీ సైతాను ప్రేరితమైనవే కాని, అంతకుమించి ఏమీ కాదు. దయ్యాలు, పిశాచాలూ మాత్రమే యోగం అభ్యసిస్తాయి" అని. పాపం వాటికన్ ను చూస్తే అయ్యో! అనిపిస్తోంది. ఈనాడు భారతదేశంలో కంటే కూడా పాశ్చాత్య దేశాలలోనే యోగం ఎక్కువగా ఆచరించబడుతున్నది. పైగా యోగ ప్రక్రియలోని వైజ్ఞానిక సంపద చూచి యావత్ ప్రపంచం ఈర్ష్యపడుతున్న ఈ కాలంలో వాటికన్ అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. "చదువ వేస్తె ఉన్న మతి పోయింది" అంటే ఇదేనేమో.
__టైమ్స్ ఆఫ్ ఇండియా - ధర్మపాలుడు