డేవిడ్ ఫ్లాయిడ్ Vs పాల్గర్ సాధువులు
డేవిడ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతి దొంగని అక్కడి తెల్లజాతి పోలీస్ హత్య చేస్తే దాని గురించి ప్రపంచం అంతా చర్చిస్తోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయమై స్పందించింది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు కూడా ఈ సంఘటనను ఖండించారు
పాల్గర్ లో ముగ్గురు సాధువులను పోలీసుల ముందే దారుణంగా కొట్టి చంపేస్తే స్థానిక మాధ్యమాలు కూడా పట్టించుకోలేదు.
ఎందుకు ఈ తేడా?
చంపబడ్డ వాళ్ళు అల్పసంఖ్యాకులు అయితేనే కమ్యూనిస్ట్ మాధ్యమాలు స్పందిస్తాయి. మనుషుల చావు నిజంగానే వారిని బాధించే మాటయితే సాదువుల హత్య గురించి కూడా ఇదే స్థాయి చర్చ జరగాలి. కానీ డేవిడ్ ఫ్లాయిడ్ విషయంలో జరుగుతున్న చర్చలో 0.0001% కూడా పాల్గర్ సాధువుల విషయంలో జరగలేదు. పాల్గర్ సాధువులు హిందువులు కావడమే అందుకు కారణం. సాధువుల స్థానంలో అల్పసంఖ్యాక (మైనారిటీ) వర్గానికి చెందిన వారు ఉండి వుంటే, మాధ్యమాలు ఎలా స్పందించేవో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పెహ్లూ ఖాన్, రోహిత్ వేములలకు మాధ్యమాలు ఎంత ప్రాధాన్యత ఇచ్చాయో మనకు తెలియంది కాదు.
ఒక నాగరికతని, అది మంచిది అయినా, కాకపోయినా, నాశనం చెయ్యాలి అంటే దానికి ప్రధాన బలంగా ఉన్న వర్గాన్ని నాశనం చెయ్యాలి. మన నాగరికతకు హిందువులు బలం అయితే పాశ్చాత్య నాగరికతకు బలం ఐరోపా తెల్లజాతి క్రైస్తవులు. ఏ దేశంలో అయినా కమ్యూనిస్టుల లక్ష్యం ఆ దేశ నాగరికతని నాశనం చెయ్యడమే. ఈ కారణం వల్లనే డేవిడ్ ఫ్లాయిడ్, పెహ్లూ ఖాన్ల హత్యని ప్రపంచం అంతా చర్చిస్తే, పాల్గట్ సాధువులు గురించి స్థానిక దిన పత్రికలలో కూడా పెద్దగా వార్తలు రాలేదు. డేవిడ్ ఫ్లాయిడ్ హత్య సహాయంతో తెల్లజాతి ఐరోపా క్రైస్తవులలో, పెహ్లూ ఖాన్ హత్య సాయంతో హిందువులలో అపరాధ భావాన్ని (గిల్టీ కాన్షియస్నెస్) సృష్టించవచ్చు. అది అంతిమంగా నాగరికత నాశనానికి దారితీస్తుంది.
కమ్యూనిస్ట్ మాధ్యామలకు నిజానికి ఎవ్వరి మీదా ప్రత్యేకమైన అభిమానం ఉండదు. ఏ వర్గానికి మద్దతు ఇస్తే నాగరికతలు నాశనం అవుతాయో వారు వారినే సమర్ధిస్తారు.
___వడియాల రంజిత్