హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కేవలం విదేశీయుల చేతనే గాక స్వజనుల చేత కూడా అడ్డూ, ఆపు లేకుండా కొనసాగింది.
ఈ అబద్దాల ప్రచారానికి ప్రతిక్రియ చేయటం కేవలం స్వాభిమాన దృష్టితోనే కాకుండా చరిత్ర నిజాలను నిరూపించుకోవడానికి అత్యంత అవసరం, వాంఛనీయం కూడా. భారతదేశం మీద దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన విదేశీశక్తులను పరాభ వించి హిందూదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన వీరులను, హిందూ రాష్ట్రాన్ని ఉద్దరించిన వారి పరం పరను, ఆ స్వాతంత్ర సంగ్రామాలకు నాయకత్వం వహించిన పరాక్రమ సంపన్నులైన మహాపరుషుల చారిత్రక శబ్ద చిత్రాన్ని ఆవిష్కరించ టానికి నిర్ణయించుకొన్నాను.
- స్వాతంత్య్ర వీర సావర్కార్