పచ్చి మిరపకాయలు తింటే కలిగే లాభాలు.
పచ్చి మిరప కాయలను మనం అనేక రకాలుగా ఆహరంలో వాడుకుంటుంటము.ఎండు కారం కు బదులుగా చాలా మంది కూరల్లో వేస్తారు.చక్కని రుచి వస్తుంది.కొందరు వీటిని అలాగే తినేస్తారు. కొందరు మజ్జొగలో కలుపుకుని తింటారు.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.
- 1. విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ బి6,ఏ,ఐరన్,కాపర్,పొటాషియం,నియాసిన్,ఫైబర్,ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- 2. వీటిని విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.
- 3. విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.పేగుల నుండి కొలెస్టరాల్ రక్తంలోకి కలవకుండా చూస్తుంది.రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది.దీనితో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
- 4. వీటిలో ఉండే క్యాప్సిసిన్ శరీర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.దీనితో క్యాలొరీలు అధికంగా ఖర్చవుతాయి.ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.
- 5. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను పోగొడతాయి.
- 6. దగ్గు , జలుబు , ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చి మిరపను బాగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి గాలి బాగా పీల్చుకోవచ్చు.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...