చివరివరకు ఎవరు నీ తోడు తెలుసా!
నిన్ను కన్న వాళ్ళు , నువ్వు కన్న వాళ్ళు, కట్టుకున్న వారు , అస్తిపాస్తులు, ఇవన్నీ వదిలి వెళ్ళిన ప్రాణం ఉన్నంత వరకు మనిషికి తోడు ఏది ?పాప పుణ్యాలు, పోయిన తర్వాత వచ్చే ఆస్తులు మంచి చెడు ఎవ్వరైనా ఎటువంటి వారికైనా చివరి వరకు తోడు ఉండే చుట్టం ఆకలి..వెంట ఉండే స్నేహితుడు కనీళ్లు..ఏవి నిన్ను వదిలి వెళ్లినా చితిలో చేరి భుడిదా అయే వరకు ఆకలి ఉంటుంది.. అలాగే బాధను పంచుకునే వారు ఎవరూ లేకపోయినా భగవంతుడు మనిషికి కన్నీటిని తోడుగా ఇచ్చాడు.. కన్నీరు ఇచ్చే ఓదార్పుని నీకు ఎవ్వరూ ఇవ్వలేరు..
దేహంలో జీవుడు రూపంలో ఉన్నది పరమాత్మే అని తెలుసుకున్న వారు తెలుసుకోలేని వారు కూడా ఉంటారు ప్రతి క్షణం తన ఉనికిని గుర్తు చేస్తూ భగవంతుడు ఆకలి రూపంలో వెంట ఉంటాడు అందుకే భగవంతుడుని నిజంగా తృప్తి పరచాలి అంటే అన్నశాంతి జరగాలి..ఆకలితో కడుపు మాడ్చుకున్నా ఆహారాన్ని వ్యర్థం చేసిన తిట్టుకుంటూ తిన్నా మహా దోషం, ఎటువంటి మంత్ర దీక్ష అయినా అన్న శాంతితో ముగుస్తుంది..ఇంకొకరి ఆకలిని గుర్తించి బోజనం పెడితే భగవంతుడుని గుర్తించి నట్టు.. అన్నదానం చేస్తే నేరుగా భగవంతుడుకి సమర్పించి నట్టు ఎందుకంటే ఆకలి రూపంలో ఉన్నది దైవమే కనుక..
ఇక కనీళ్లు వేడిలో కూడా వెన్నెల వంటి చల్లదనాన్ని సహస్త్రరం చేరుకున్న సాధకుడే తెలుసుకుంటాడు కానీ ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి తెలియడానికే భగవంతుడు కన్నీటిని ఇచ్చాడు ఎంత బాధలో అయిన కన్నీరు మనసుకి ఊరటని చల్లదనాన్ని ఇస్తుంది.. కనీళ్లు ఎంతో విలువైనవి అవి అర్హత లేని వారికోసం వృధా చేసుకోకూడదు..
హోమాలు చేయించు కునే స్తోమత లేకపోయినా ఒకరికి భోజనం ఇవ్వగల స్థితిలో అందరూ ఉంటారు వీలైనంత వరకు అన్నదానం అన్నిటికి చక్కటి పరిహారం ముఖ్యంగా నోరులేని జీవాలు అడగలేవు వాటిలో కూడా ఆకలి రూపంలో ఉన్నది భగవంతుడు వాటికి ఆహారాన్ని ఇస్తే మహా పుణ్యం...
తినే వారిని మధ్యలో లేపకూడదు.. తింటున్న వారిని ఏ కారణం చేత తిట్టకూడదు ముఖ్యంగా భర్త కి బోజనమ్ పెట్టె సమయంలో తిడుతూ పెట్టకూడదు ఆడవాళ్లు గుర్తించు కోవాలి.. నాలుగురు భోజనం చేస్తున్న చోట ఒక్కరు ఏమీ తినకుండా ఉండకూడదు అది ఉపవాసం లో ఉన్నవారు అయినా పాలో పండో వారికి ఇవ్వాలి.. వంట రుచిగా లేకపోయినా తిట్టుకుంటూ తినకూడదు అది బ్రహ్మణి అవమానించి నట్టు.. వంట చేసే వారు తల్లితో సమానం ఎట్టి పరిస్థితుల్లో నూ వంట చేసిన వారిని హీనంగా మాట్లాడటం అవమానించడం చేయకూడదు..
- ➣ అన్నం పరబ్రహ్మ స్వరూపం తినే ప్రతిసారి భగవంతుడు కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నదాత(రైతు) క్షేమం కోరుకొని తినాలి..తినే టప్పుడు మాట్లాడ కూడదు..
- ➣ ఆహారం లో వెంట్రుకలు వస్తే ఆ ప్రాంతాన్ని త్వరలో వదిలి వెళ్ళిపోతారు..
- ➣ సాధువులకు పెట్టె ఆహారంలో వెంట్రుకలు వస్తే విస్తరి తీసి మళ్ళీ వేరే వడ్డించాలి.
- ➣ సాధువులకు తిన్న ఆహారం ఆకులు వారు తీయకూడదు, ఆకులో వారు చై కడగకూడదు..
- ➣ భోజనం చేసిన చోటే కదలకుండా కూర్చో కూడదు.. కాస్త పక్కకి జరిగి అయినా కూర్చోవాలి..భోజనం ఐయ్యాక పళ్ళెంలో కొద్దిగా అయినా నీరు వదిలి లేవాలి
- ➣ తినే టప్పుడు తలపైనపాగా, టోపి ఉండకూడదు, నిల్చుని తినకూడదు, పాదరక్షలతో తినకూడదు..
- ➣ తూర్పు ఉత్తరం దిక్కు వైపు తినాలి
- ➣ ఉపవాసం వదిలిన వారు ఆహారంలో ఉప్పు తక్కువ అయితే నేరుగా పళ్ళెంలో ఉప్పు వడ్డించు కొకూడదు , ఆ పదార్ధంలో కలిపించి వడ్డించుకోవాలి..
- ➣ మిగిలిన అన్నం మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు విషపూరితం అవుతుంది, మిగిలిన అన్నం చల్లగా ఉన్నా తినవచ్చు అందులో పోషకవిలువలు ఉంటుంది..
శ్రీ మాత్రే నమః