వింశోత్తరీ చరదశాప్రస్తారం యొక్క సంపూర్ణావర్తన కాలం యెంత?
వింశోత్తరీ చరదశాప్రస్తారం యొక్క సంపూర్ణావర్తన కాలం యెంత అనే విషయం తెలుసుకోవటం చాలా ఆసక్తికరమైన విషయం.
ఒక సారి మనం ప్రతి గ్రహం యొక్క వింశోత్తరీ దశా ప్రమాణ కాలం యెంతో పరిశీలిద్దాం. ఈ పట్టిక ముందు చూసినదే నని గురు తెచ్చుకోగలరు సులభంగా
గ్రహం | దశా సంవత్సరాలు |
రవి | 6 |
చంద్రుడు | 10 |
కుజుడు | 7 |
రాహువు | 18 |
గురుడు | 16 |
శని | 19 |
బుధుడు | 17 |
కేతువు | 7 |
శుక్రుడు | 20 |
ఒకగ్రహం యొక్క వింశోత్తరీ చరదశా పూర్ణావర్తనం అంటే అది పీఠిక మీది స్థిరగ్రంహంతో సంయోగం చెందటం.
ఉదాహరణకు:
- ➣ ఇది రవికైతే 6 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు.
- ➣ అంటే 120 సంవత్సరాలలో రవి 120 / 6 = 20 పూర్ణావర్తనాలు చేస్తాడన్నమాట.
- ➣ ఇలా అన్నిగ్రహాలు ఒకేసారి పూర్ణావర్తనాలు పూర్తిచేసిన సంఘటన జరగటానికి పట్టే కాలం 6, 10, 7, 18, 16, 19, 17, 20.
- ➣ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం (క.సా.గు) అవుతుంది. ఈ సంఖ్య 16,27,920.
- ➣ అంటే 16,27,920 సంవత్సరాలు గడిస్తే కాని సంపూర్ణ వింశోత్తరీ చర దశా వర్తనం కాదన్న మాట,
- ➣ ఇది త్రేతాయుగం కంటే హెచ్చు సంవత్సరాలు! ఎందుకంటే త్రేతాయుగప్రమాణం 12,96,000 సంవత్సరాలే కదా.
- ➣ అన్నట్లు మన కలియుగం పాపం 4,32,000 సంవత్సరాలే సుమండీ.
అందుచేత ప్రజలారా, ఏ జాతకంలోనైనా సరే వింశోత్తరీ చరదశా పూర్ణావర్తనం జరిగి అది చరగ్రహాలన్నీ వాటివాటి పీఠికాస్థితస్థిరగ్రహాలతో సమైక్యం కావటం ఆ జాతకుడి జీవితకాలంలో కలలో కూడా జరుగనే జరుగదు. కాబట్టి ఈ విషయంలో నిశ్చింతగా ఉండవచ్చును.
ఈ వింశోత్తరీ నూతనవిధానాన్ని పరిశీలించి ఫలితాలు సంపుటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సంకలనం: శ్యామలీయం