శుక్రవారము లక్ష్మీదేవి
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణీ నమోస్తుతే
సర్వమంగళ మాంగళ్యే.....మంగళప్రదమైన
శివ..చైతన్యము
సర్వార్ధ సాధికే ... నిర్విజ్ఞంగా కార్యసాధన చేకూర్చే
శరణ్యే...శరణార్దులకు రక్షణ ఇచ్చే
త్ర్యమ్బకే దేవి ..మూడు లోకాలకు అమ్మ
నారాయణీ...శ్రీమన్నారాయణుని ధర్మపత్ని
నమోస్తుతే ...నమస్కారము.
ప్రతిపనిని మంగళకరంగా [ఎటువంటి ఆటంకాలు లేకుండా ] జరిగేటట్లు చేస్తూ, నిన్నే శరణు కోరిన వారికి రక్షణ కల్పిస్తూ, మూడు లోకాలుకు అమ్మవై , శ్రీమన్నారాయణుని ధర్మపత్ని అయిన లక్ష్మిదేవి నమస్కారము.
రచన: గాయత్రీ