‘తమసోమా జ్యోతిర్గమయ’
అంటే చీకటి నుంచి వెలుగుకు రండి అని చెబుతోంది ఉపనిషత్తు. మన వేదాలు, ఉపనిషత్తు జీవితాలకు వెలుగునిచ్చే రీటిలో ఇలా ఎన్నో వైజ్ఞానికాంశాలను భోదిస్తున్నాయి. మన మంత్రాలలో ఎన్నో వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయన్నది సత్యం.
ఉదాహరణకు అణువు నుంచి క్రమంగా పరిణామ వృద్ధి జరిగి జీవరాశి ఏర్పడిందని వైజ్ఞానిక ఆధారాల ద్వారా నిరూపించుకుంటున్నారు. అనంతరం డార్విన్ సిద్ధాంతాన్ని అనుసరించి, కోతి నుంచి మనిషి పరిణామం చెందాడని చెప్పుకుంటున్నాం.
శ్రీమహావిష్ణువు దశావతారాలను చూసినపుడు మనకు ఈ పరిణామ క్రమం తెలుస్తుంటుంది. నీటిలో నివసించే మత్స్యావతారం, అనంతరం నీటిలో మరియు భూమిపై నివశించగల కూర్మావతారం. అనంతరం వరాహావతార మంటూ సాగి శ్రీరామావతారంలో పూర్ణపురుషునిగా స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఇలా మన పురాణాలలో ఎంతో విపులంగా పరిణామక్రమాన్ని గురించి విశదీకరించబడింది.
అణువు |
అణువును చేధించలేమన్నది గతంలో శాస్త్రజ్ఞుల భావన. కానీ, ఆ తరువాత అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూక్లియస్ ల వంటివి ఉన్నాయని తేలింది. అలాగే అనువులోపలనున్న ఎలక్ట్రానులు అలలు అలలుగా తిరుగు తుంటాయనీ, మధ్యభాగంలో న్యూక్లియస్ అనేది ఉంటుందని శాస్త్రజ్ఞులు విశ్లేషించారు. ఈ అమరిక శ్రీచక్రానికి సంబంధించినదంటే అతిశయోక్తి కాదు. శ్రీచక్రంలో కనిపించే తామరరేకుల వంటి గీతలు అలలు అలల్లా తిరిగే ఎలక్ట్రానులనుకుంటే, కోణాలు అడ్డదిడ్డంగా తిరిగే ప్రోటానులే. ఇక శ్రీచక్రం మధ్యనున్న బిందు మండలం న్యూక్లియస్. వైజ్ఞానిక పరంగా అణువుని ఆధారం చేసుకుని సైన్సు ఈ విశ్వ రహస్యాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తుండగా, అందుకు తగిన సమాధానం శ్రీచక్రంలో ఉందన్నది స్పష్టం.
హిరణ్యకశిపుడు సంహరిస్తన్న నారసింహుడు |
అని అడ్డగ్గా, అందుకు ప్రహ్లాదుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
కలడంభోది గలండు గాలి గల
డాకాశంబునం గుంభినిం
గల డగ్నిన్ దిశలం బగళ్ళ
నిశలన్ ఖద్యోతచంద్రాత్మలం
గల డోంకారమునం ద్రిమూర్తుల
ద్రిలింగవ్యక్తులం దంతటం
గల దీశుండు గలండు తండ్రి!
వెదకంగా నేల నీయయోడన్ ||
కళ అనేది మానవ జీవనవికాసానికి సోపానం. కళ విజ్ఞాన సముపార్జనకు తోడ్పటమేకాక, జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. మన పూర్వులు అందించిన చతుష్పష్టి కళలలో ‘యంత్రమాతృక’ అనే కళ ఉంది. తద్వారా మన పూర్వీకులు యంత్రనిర్మాణశాస్త్రంలో ఘటికులన్న విషయం తేటతెల్లమవుతోంది.
- ➣ పుష్పక విమానం, నవవిమానం గురించి మన పురాణాలలో కనబడుతోంది.
- ➣ ఆకాశగమనం, గగన ప్రవేశం గురించి చెప్పబడింది.
- ➣ రామాయణంలో కనబడే పుష్పక విమానాన్ని విశ్వకర్మ తయారు చేసి బ్రహ్మదేవునికి ఇవ్వగా, బ్రహ్మదేవుడు కుబేరునికి ఇస్తాడు. కుబేరుని దగ్గర్నుంచి రావణుడు లాక్కుంటాడు.
- ➣ రావణుడు ఈ పుష్పక విమానంలోనే సీతమ్మను అపహరిస్తాడు.
- ➣ రామ రావణ యుద్ధానంతరం విభీషణుడు పుష్పక విమానాన్ని శ్రీరామునికి బహుకరిస్తాడు. శ్రీరాముడు దీనిని తిరిగి కుబేరునికి ఇచ్చేస్తాడు.
- ➣ పుష్పకవిమానం వర్ణన అత్యంతఅద్భుతంగా ఉంటుంది. దాని భాగాలన్నీ బంగారంతో నిర్మించబడ్డాయి. ఆ విమానంలో వైఢూర్య, మణిమయమైన వేదికలు, మంటపాలున్నాయి.
- ➣ ఇంకా ఆ విమానం అంతస్తులుగా నిర్మించబడింది. ఆ అంతస్తుల శిఖరాలు స్ఫటికాలతో, వైఢూర్యాలతో తాపడం చేయబడి ఉంది.
- ➣ అంతటా మణిమయమైన తివాసీలు, ఆసనాలు ఉన్నాయి.
- ➣ బంగారు పద్మాలతో చక్కగా అలంకరించబడి ఉంది.
- ➣ విమానం కిటికలకు ముత్యాలు, మణులు పొదగబడి ఉన్నాయి.
- ➣ దాని వేగం మనోవేగంతో సమమైనది.
ఇక ప్రళయకాలంలో త్రిమూర్తులు నవవిమానంలో అంబిక కొలువై ఉన్న ప్రదేశానికి చేరుకున్నట్లు కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా మన పురాణాలను జాగ్రత్తగా పరిశీలించినపుడు ఇటువంటి వైజ్ఞానికాంశాలు ఎన్నో దృగ్గోచరమవుతుంటాయి. కావాల్సింది పురాణాలను చదవడమే.
సంకలనం: నాగవరపు రవీంద్ర