పూజ ఏ పూవు తో చేయాలి
ఏ దేవుడుకు ఎటువంటి పూలు వలన ఫలితం ఎక్కువ తెలుసా..దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది. దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే.. మీ జీవితం..భవిష్యతు.. భాగుంటుంది
- 1. దేవునికి కాగితం పూల - మాలను వేస్తే నిత్య దరిద్రులు అవుతారు
- 2. దేవునికి ప్లాస్టిక్ పూలమాలను - వేస్తే చర్మ వ్యాధి వస్తుంది.
- 3. ఒకరు పూజ - చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే..గ్యాస్ట్రిక్ వ్యాధి వస్తుంది.
- 4. పాడయిన పూలతో - పూజ చేస్తే దేహంలో అయిన గాయాలు నయం కావు.
- 5. పురుగులు ఉన్న పూలతో పూజ - చేస్తే పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి.
- 6. సువాసన నిండి ఉన్న పూలతో పూజ - చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుoది.
- 7. పూజకు ముందే పూల వాసనను - ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా ,హృదయ సంబoద సమస్యలు ఎదుర్కొంటారు.
- 8. ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను - వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది.
- 9. ఎవరైతే దేవునికి కనకాంభరం పూలతో పూజచేస్తారో - వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు - కనకాంబరం పూలు పూజకు పనికిరావు.
- 10. విచ్చని పూలతో - పూజ చేస్తే మీ పనులు చాలా ఆలస్యం గానూ, కొన్ని సార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి
ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది:
- 1. దేవునికి జాజి పూలు - అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి, మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి
- 2. దేవునికి సంపెంగ పూలు - అర్పించి ప్రసాదం స్వీకరిస్తే, మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు . శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది
- 3. పారిజాత పువ్వుని - అర్పిస్తే కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లబిస్తుంది.
- 4. రుద్రాక్ష పువ్వును - అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది.
- 5. మొగలి పువ్వును - అర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.
- 6. లక్కీ పువ్వుతో - పూజిస్తే భార్య పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు.
- 7. పద్మం లేదా కమలంతో - పూజిస్తే సమస్త దారిద్ర నివారణ. శ్రీమంతులు అవుతారు.
- 8. మల్లి పువ్వుతో - పూజిస్తే అన్ని రోగాలు నయం అవుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
- 9. గన్నేరు పూలతో - పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.
- 10. కల్హార పుష్పంతో - పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
- 11. పాటలీ పుష్పంతో - పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.
- 12. కంద పుష్పంతో - పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
- 13. తుమ్మ పూలతో - ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిఫై భక్తి అధికం అవుతుంది.
- 14. నందివర్ధనం పూలతో - శివునికి పూజ చేస్తే జేవితంలో సుఖం ,శాంతి , ప్రశాంతత లబిస్తుంది.
- 15. కణగాలే పుస్ఫం - దీనితో దేవునికి పూజ చేస్తే, మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి . విద్య ప్రాప్తి సిద్దిస్తుంది. దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.
- 16. అశోక పుష్పాలతో - దేవికి పూజ చేస్తే జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి
- 17. నల్ల కలువ పుష్పాలతో - శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి.
- 18. పాదరి పుష్పంతో పూజ చేస్తే - అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.
- 19. మాలతి పుష్పంతో - దేవునికి పూజ చేస్తే..అన్ని పాపాలు తొలగిపోతాయి.
- 20. పున్నాగ పుష్పం - ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి అయిన.. ,శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది.
- 21. వకుళ పుష్పం - శ్రీ భూవరాహ స్వామికి , శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.
- 22. ఉత్ఫల పుష్పం - జీవితంలో చాల కస్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే..జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.
- 23. తెల్లని జీల్లేడు పువ్వుతో - గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.
- 24. ద్రోణ పుష్పం - ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనo , మిత్రలాభం అవుతుంది. అధికారం ప్రాప్తిస్తుంది.
- 25. భందూక పుష్పం - ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే.. బంధువులు క్షేమంగా ఉంటారు.
- 26. అగసి పువ్వుతో - దేవికి పూజ చేస్తే..పాపాలు తొలగిపోతాయి.
- 27. సురభి పుష్పం - శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.
- 28. పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే - పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
సంకలనం: ఎన్ కిషోర్