మీ వంటగదే ఔషధశాల
మనం వంట గదిలో వాడుకొనే అనేక ఔషధ విలువలు కలిగిన పదారాలను గురించి, వాటి యొక్క ఉపయోగాలను గురించి, విశదంగా చర్చించడానికి ప్రయత్నించడం జరిగింది. మామూలుగా వచ్చే జిలుబు, దగ్గు మొదలైన వాటినుండి తీవ్రంగా ఉండే ఆస్త్మా-ఉబ్బసం , మధుమేహం వంటి జబ్బుల వరకూ, వైద్యుని వద్దకు వెళ్ళనవసరం లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో విశదీకరించడం జరిగింది.పసుపు: (Curcuma longa)
పసుపు అల్లం జాతికి చెందిన దుంప. పసుపు వాడకం భారతదేశంలో చాలాకాలం నుంచి అంటే వేల సంవత్సరాల నుండీ ఉంది. పసుపును రెండు రకాలుగా వాడతారు. పచ్చి పసుపు దుంపలను అలాగే ఎండబెట్టి వాడడం మరియు ఉడికించి, ఎండ బెట్టివాడడం. ఉడికించిన దుంపలను వాడడమే మనకు ఎక్కువ అలవాటు. దీనివలన పసుపులోని ఎలర్టీ కలిగించే గుణం పూర్తిగా పోతుంది.
పసుపులో ఉన్న ఔషధ గుణాలు:
- ➣ పసుపును పైపూతగా, మరియు లోపలకి కూడా తీసుకొంటారు.
- ➣ నీళ్ళతో కలిపి పాదాలకి పూయడం వలన ఫంగస్ వ్యాధులు, గజ్జి, ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గుతాయి. కాలి పగుళ్ళు రాకుండా ఉంటాయి.
- ➣ పసుపును, కొద్ది నూనెలో కలిపి వేళ్ళ మధ్య ఉంచితే, నీళ్ళలో నానడం వలన వచ్చిన ఎలర్జీ తగ్గి పాదాలకు అందం వస్తుంది.
- ➣ ముఖానికి పూస్తే నల్లమచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
- ➣ పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట అల్సర్లు తగ్గుతాయి.
- ➣ శరీరం పైన వచ్చే ఎర్రని ద్దు్లు (Rash) పూర్తిగా పోతాయి.
- ➣ బాలింతలకు పెడితే పాలు బాగా పడతాయి.
- ➣ వేడిపాలలో ఒక గ్రాముపసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.
- ➣ 5 గ్రా పసుపు పొడి, 5 గ్రా ఉసిరి పొడి కలిపి తెల్లవారగానే ఇస్తే, మధుమేహం (Dabetes) క్రమేణా తగ్గిపోతుంది.
- ➣ పసుపు ప్రతినిత్యం తీసుకొంటే వారిలో, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్జబ్బు రాదు.
- ➣ అప్పుడే తగిలిన గాయాలపై పసుపుపొడి జల్లితే చీము పట్టకుండా, తొందరగా మానిపోతాయి.
- ➣ దీని నుండి తీసిన కర్క్యుమిన్ అనే పదార్దము ఆయింట్మెంటు రూపంలో మార్కెట్లోకి వస్తోంది.
- ➣ పసుపు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది.
- ➣ పసుపు ఔషధమేకాక ఒక గొప్ప సౌందర్య పోషకం (Cosmetic) కూడా.
కనుక పసుపు వాడడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి