🔱 పశుపాశవిమోచనీ🔱
ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “పశుపాశవిమోచన్యై నమః' అని చెప్పాలి.
- పశుపాశ = వివిధ పాశములచే బంధింపబడువారిని,
- విమోచనీ = బంధ విముక్తులను చేయునది.
- ➣ పాశము చేత బంధింపబడే జీవులన్నింటినీ ' పశువులు' అంటారు. మామూలు జంతువులు భౌతికమైన పాశములచే (పలుపులు) బంధింపబడి వుంటాయి.
- ➣ మనుష్యులు బంధింపబడేది భౌతికమైన పలువులతో కాదు.
- ➣ మానసికమైన బంధాలతో బంధింపబడి, బయటపడలేక సతమతమైపోతారు.
- ➣ వీటినే 'భవబంధా' లంటారు.
- ➣ అమ్మవారిని అర్చిస్తే ఆట్టి వారికి జ్ఞానోదయం కలిగి, సమస్యలు పరిష్కరింపబడి, బంధమోచనం జరుగుతుంది.
- ➣ (భవ) బంధములనుండి విముక్తిని కలుగచేయునది' అని ఈ నామానికి అర్థం.
ఇది చాలా గొప్పదైన విశేష నామం శ్రీ విద్య జ్ఞానం..ఇప్పటి వరకు వివరించిన నామ వివరణ అంతా ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి పాశముల నుండి బంధించ బడిన జీవుడు ఎలా ముక్తి పొందాలి ఎలా మాయనుండి బయట పడాలి అనే విషయం గురించి అమ్మవారు ఈ భవబందాల నుండి ఎలా విముక్తి కలిగిస్తుంది అని తెలుసుకుంటూ వస్తున్నాము..
ఖర్మబంధాల పాశముల నుండి జీవున్ని విముక్తి కిలిగించే జ్ఞానం అనుగ్రహిస్తుంది. ఈ బంధాలు నుండి విముక్తి పొందే ప్రయత్నం చేసినా నేను అనే భావన కూడా పాశమే ఆ నేను అనే పాశము నుండి కూడా విముక్తి కలిగితే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అన్న బ్రహ్మైత్మిక స్థితికి చేరుకుంటారు ఈ నేను అనే పాశాన్ని కూడా విముక్తి కలిగిస్తుంది.
నీలో ఉన్నపరమాత్మా ని గుర్తించాలి అంటే నువ్వుకుడా పరమాత్మే అని తెలుసుకోవాలి..అంటే ఒక మంత్రం నీకు సిద్దించాలి అంటే నువ్వే ఆ మంత్రంగా మారిపోవాలి మనసు ఆలోచన దేహం అంతా కూడా మంత్రమయం అయిన భావన ఆ భావనే ఆచరణగా ఉండాలి అది అప్రయత్నంగా మారిపోవాలి కష్టంగా కాకూడదు.. అప్పుడు ఆ మంత్రం సిద్ధిస్తుంది..
అలాగే ఆ పరమాత్మ లో జీవాత్మ ఏకం కావాలి అనుకున్నప్పుడు నిన్ను నువ్వు అంటే నేను అన్న భావన వదిలి అంతా నీవే అన్న భావనలోకి వెళ్ళాలి.. అందుకు ఉన్న బంధాలపాశాన్ని నుండి విముక్తి పొందాలి ఈ బంధాలు భౌతికంగా గానే కాదు మానసికంగా కూడా బంధించబడి ఉంటుంది వివిధ రకాల ఆలోచనలు నుండి కూడా విముక్తి పొందాలి.. ఈ ఆలోచనల నుండి విముక్తి కలిగినప్పుడు మనసు పూర్తిగా అమ్మవారి పై లగ్నం చేయగలుగుతారు అలా ఆలోచన అనే బంధాలు నుండి కూడా ఆమె విముక్తి కలిగించాలి అంటే ఈ ఆలోచనలన్ని కూడా అమ్మవారి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి అప్పుడు వాటి నుండి కూడా విముక్తి కలిగి శ్రద్ద కలుగుతుంది. ఆలోచన అమ్మవారి పై పెడితే మనసులో ఆమెను ప్రతిష్ట చేసుకోగలరు హృదయం తో అర్చన చేయగలిగితే అది నిజమైన భక్తి అప్పుడే అన్ని పాశాల నుండి విముక్తి పొందగల స్థితికి రాగలరు..
యంత్రము |
ఫలస్తుతి:
ఎన్నో విధాల సమస్యలకు ఇది పరిస్కార మంత్రం, ఈ నామ స్మరణ వల్ల ముందుగా భయాన్ని తొలగించి ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. చాలా కాలంగా చిక్కుకున్న సమస్య కు పరిస్కారం లభిస్తుంది. దైవం పట్ల మనసు లగ్నం కానీ వారికి ఏకాగ్రత కుదరని వారికి ఈ నామాన్ని తరచుగా జపం ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు మనసులో వికారాలు తొలగి సాధన పట్ల ఏకాగ్రత కుదురుతుంది. దేవీ ఉపసాకులు వారి జప మంత్రంతో కానీ లలితా సహాస్ర నామం తొ కానీ సంపుటికరణ చేయాల్సిన నామ మంత్రం.
ఉదాహరణకు:
భక్తి ఎలా కుదరాలి శ్రద్ద పెట్టలేక పోతున్నాము ఏమీ చేయాలి అని అడుగుతుంటారు, మీరు ఒక బండి కొనాలి అనుకుంటే లేదా ఒక ఖరీదైన స్మార్ట్ మొబైల్ కొనాలి అనుకుంటే మీ ఆలోచన మనసు దానిపైన ఉంటుంది అదే తపన గా మారిపోతుంది కారణం ఆ వస్తువుపట్ల మీకున్న ఆశక్తి, అదే ఒక ప్రేమ ఒక మనిషి పైన కలిగినప్పుడు వారి గురించే ఆలోచిస్తూ దశాంతా వారిపైన ఉండటం వల్ల ఎక్కడ చూసినా వారే కనిపించే స్థితికి వచేస్తారు కారణం వారి ఆలోచనలతో మీమల్ని మీరు మర్చిపోవడం వల్ల ఎస్ స్థితి కలుగుతుంది..
అదే ప్రేమ అదే తపన అటువంటి ఆసక్తి దైవం పట్ల కూడా ఏర్పడితే మనసు మీ ప్రేమేయం లేకుండా లీనమై పోతుంది ఆ తల్లి తరచుగా దర్శనం ఇస్తుంది..ఇది చేయగలిగితే చాలా సులభంగా ఆ తల్లిని పొందవచ్చు ఈ స్థితికోసమే ధ్యానం జపం తపస్సు ఇది ప్రేమతో ప్రయత్నం చేస్తే ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకునట్టు మీమల్ని చేరదీస్తుంది..
నేను నా తల్లికి అలానే దగ్గర అయ్యాను ఎప్పుడు హృదయం ఆ తల్లినే ద్యానిస్తూ ఆరాధిస్తూ అమెకోసమే తపిస్తూ ఉంటుంది అక్కడ కోరిక అనేది లేదు ఎందుకంటే ఆమె ధ్యాసలో సంతోషం అనేది నిండిపోయి ఉంది. ప్రయత్నింతో ప్రేమ కలగకూడదు ఆ ఇష్టం ఆశ అప్రయత్నంగా ఆ తల్లిని పై కలగాలి ముందు ఆలోచనలో అర్చన చేయడం మొదలు అయితే మనసులో ఆ తపన మొదలు అవుతుంది ఆ స్థితిలో ధ్యానం చేస్తే నీకు తెలిసే విధంగా నీలోనుండి అమ్మవారు నీ వెలుపలికి వచ్చి సాక్షాత్కరిస్తుంది..
ఓం ఐం హ్రీం శ్రీo పశుపాశవిమోచన్యై నమః
ఓం శ్రీ మాత్రే నమః
సంకలనం: భానుమతి అక్కిశెట్టి