శూద్రులను గురించి మనువు అభిప్రాయాలని చూద్దాము. “శోచంతి ఖిద్యస్త ఇతి శూద్రా" కష్టపడేవారని అమరము. బ్రాహ్మణులు విరాట్పురుషుని ముఖం నుంచి. శూద్రులు పాదాలనుంచి పుట్టారని మనుస్మృతి.
- ➣ శరీరంలో ముఖం ఎంత ముఖ్యమో పాదాలు అంతే ముఖ్యము.
- ➣ ఛందస్సు వేదపురుషునికి పాదాల వంటిది అన్నదాని భావం కూడా అంతే.
- ➣ మనిషి సర్వాం గములతో కూడిన వాడైనప్పటికీ, కాళ్ళు లేకపోతే ఎంత కష్టమో, అట్లాగే కష్టపడి
- ➣ పంటలు పండించి, సేవలుచేసే వాళ్లు లేక పోతే కూడా అంతే కష్టము. అదే మనువు భావంగా కన్పిస్తుంది.
- ➣ అట్లాకాకపోతే అంటరానివాడైన శూద్రుడు కూడా ఆ విరాట్పురుషుని నుంచే పుట్టినట్లుగా ఎందుకు వర్ణిస్తాడు? కనుక పై కులాల వారందరికీ శూద్రుడే ఆధారభూతుడని అర్థం చేసుకోవాలి.
- ➣ అంతేకాదు - వృద్ధుడైన శూద్రుడు బ్రాహ్మణునికి గౌరవింపదగినవాడేనట.
- ➣ ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు శూద్రునికంటె తక్కువ వారి ఇంటకూడా భోజనం తినవచ్చును. అందుకు బ్రాహ్మణాలులైన విశ్వామిత్రుడు, భరద్వాజుడు వంటివారే నిదర్శనము.
- ➣ కనుక వీటన్నింటిని బట్టీ ఆలోచిస్తే ఆనాటి శూద్రులు, మనమనుకొనే శూద్రులు కారనిపిస్తోంది.
అయితే - శూద్రుడు తాకితే అతని నాలుక కోసి వెయ్యాలని, శూద్రుడు ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే లింగచ్ఛేదం చెయ్యాలని మనుస్మృతిలో కన్పిస్తోంది. అది తీవ్రమైన నాటి శిక్షావిధానానికి నిదర్శనం ఎందుకంటే దొంగతనం చేస్తే శిరచ్చేదం చెయ్యమని మనువే చెప్పాడు.
ఏమైనప్పటికీ అంత క్రూరమైన శిక్షలు అలనాటి పరిస్టుల బట్టి ఉండేవని తెలుస్తోంది. ఏమైనప్పటికి ఇలాంటివి సమర్థనీయములు కావు.
రచన: నల్లందిగళ్ లక్ష్మీనరసింహ ఆచార్యులు