ఓం నమః శివాయ
కాశీ ఖండం – మొదటి భాగము
- ‘’ఆది పూజ్యం ,ఆది వన్ద్యం ,సిద్ధి బుద్దీశ్వరం ప్రభుం – శుభ ,లాభ తనూజం తం ,వందేహం ,గణ నాయకం ‘’
- ‘’విశ్వేశం ,మాధవం దుమ్దిం,దండ పాణించభైరవం – వందే కాశీం ,గుహాం ,గంగాం ,భవానీం ,మణి కర్ణికాం
- ‘’న గాయత్ర్యా సమో మంత్రం –న కాశీ సదృశీ పురీ – న విశ్వేశ సమం లింగం –సత్యం ,సత్యం ,పునః పునః ,
- ‘’కలౌ విశ్వేశ్వరోదేవః – కలౌ వారాణశీ పురీ –కలౌ భాగీరధీ గంగా – కలౌ దానం విశిష్యతే ‘’
- ‘’కాశ్యాం హి కాశ్యతే కాశీ –కాశీ సర్వ ప్రకాశికా –సాకారీ విదితా ఏవ – తేన ప్రాప్తాహి కాశికా ‘’
- ‘’కాశీ బ్రహ్మేతి వ్యాఖ్యానం –తబ్రహ్మ ప్రాప్యతే –త్రాహి –తస్మాత్ కాశీ గుణాన్ ,సర్వే-తత్ర తత్ర వదన్తిహి’’
- ‘’కాశీ కాశీ తి కాశీతి –రాసానా రస సం యుతా –యస్య కస్యాపి భూ యాశ్చేత్త్ –స రసజ్నో న చేతరః ‘’
వింధ్యాద్రి వర్ధనం
ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి ,సంచారం చేస్తున్నాడు ..ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు. దాని నిండా ఫల పుష్ప వృక్షాలు కన్నుల విందు చేస్తున్నాయి .అనేక జంతు సమూహాలు ,పక్షులు తిరుగుతూ దాని శోభను పెంచుతున్నాయి ..నారదుని చూసి వింధ్యాద్రి పర వశించింది. ఆయనకు సపర్యలు చేయాలని కోరిక కలిగింది. నారదుని రాకతో పునీతుడై నట్లు వింధ్యాద్రి చెప్పుకొన్నది .మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్య కర విశేషాలను అడిగి తెలుసుకొన్నది .మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని, హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము , పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు .మేరువు స్వర్ణ మయం అయినా, రత్నాల తో నిండి ఉన్నా తాను గౌర విన్చాల్సిన పని లేదని బింకం గా పలికాడు .మందేహాదులకు నిలయ మైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది ,సర్వ సర్ప సమూహాలున్నరైవతాద్రి ఉన్నది,హేమ, త్రికూట, క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వ హింప లేవు మొత్తం మీద భూ భారాన్ని మోసే శక్తి ,సామర్ధ్యాలు తనకు మాత్రమె ఉన్నాయని వింధ్య పర్వతం నారద ముని తో ప్రగల్భాలు పలికింది
నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది .గర్వం తో అందర్ని చులకన గా మాట్లాడు తున్నాడని గ్రహించాడు .శిఖర దర్శనం తోనే మోక్షమిచ్చే శ్రీ శైల పర్వతం ఉంది దాని ముందు వింధ్య ఎంత ?అను కొన్నాడు .కాని ఉపాయం గా వింధ్యాద్రి తో ‘’వింధ్య రాజా ! నిజం చెప్పావు . మేరు పర్వతం నీ చేత కించ పరచ బడింది. నేనూ అదే అనుకొన్నాను నీ నోటి నుంచి నిజం బైటికి వచ్చింది. అయినా ఏదో పేరు, ప్రతిష్టా సంపాదించుకొన్న వారి గురించి మనకెందుకు చింత ?
మనం విమర్శించటం ఉచితం కాదు .నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గం లో వెళ్లి పోయాడు . నారదుని మాటలు విన్ధ్యాద్రికి మాత్సర్యం కలిగించాయి .’’శాస్త్రం తిరస్కరించిన వారి జీవితం , జ్ఞాతుల చే పరాభ వింప బడిన వారి జీవితం వృధా .వారికి కునుకు పట్టాడు ..దుఖం తో నాకేమీ పాలు పోవటం లేదు .దుఖం జ్వరం లాంటిది. వైద్యుడికి లొంగదు.మేరువును ఎలా జయించాలి ? యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కొంటె, మా రెక్కల్ని టిని వాజ్రాయుధం తో ఇంద్రుడు నరికేశాడాయే .మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది ?దాని గొప్ప తనానికి ఈర్ష్య నాలో పెరిగి, దహిస్తోంది .భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి .భూభారం ఎలా మోస్తోంది ?బ్రహ్మ చారి నారడుడి మాటలు నర్మ గర్భం గా ఉన్నాయి .నాకు సరైన మార్గాన్ని చూప గల వాడు విశ్వేశ్వరుడే .సాక్షాత్తు సూర్య భాగ వానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు ..కనుక నేను కూడా నిలువు గా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించు కోవాలి ‘’అని అనేక రకాలు గా మధన పడింది .చివరకు ఆకాశం లోకి నిలువు గా పెరగటం ప్రారంభించింది ‘

సూర్య గమనానికి అడ్డు కోనేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది .సూర్యుడే తనను దాటి వెళ్ళ లేడుఇక యముడెలా దాటి దక్షిణ దిక్కు కు వెళ్తాడు ?అను కొన్నది .మనసు లోని చింత తీరి ధైర్య స్తైర్యాలు కలిగాయి వింధ్యకు .
సత్యలోక వర్ణనం
సకల జగత్తుకు సూర్యుడు ఆత్మ. చీకటికి విరోధి రోజూ ఉదయాద్రిన ఉదయించి చీకటిని సంహరించి వెలుగు నింపుతూ పద్మాలకు ప్రకాశాన్నిస్తూ నిత్య కృత్యాలకు తోడ్పడుతాడు సాయంకాలం పశ్చిమాన అస్తమించి కలువలకు వికసనం కలగ టానికి కారణం అవుతున్నచంద్రుని రప్పిస్తున్నాడు . . సూర్యునికి మలయానిలం ఉచ్చ్వాసం క్షీరోదకం అంబరం, త్రికూట పర్వతం రత్న రాశుల ఆభరణం ,సువేల పర్వతం నితంబం ,కావేరి గౌతములు జన్ఘాలు, చోళ రాజ్యం అమ్శుకం, మహారాష్ట్ర వాగ్విలాసం. అలాంటి దక్షిణ నాయకుడైన రవి అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది .అప్పుడు ఆయన సారధి అనూరుడు మేరువు తో పోటీ పడి వింధ్య పెరిగి మార్గాన్ని అడ్డ గిన్చిందని తెలిపాడు. గగన మార్గానికి నిరోధం కలిగి నందుకు సూర్యుడు ఆశ్చర్య పడ్డాడు .
సూర్య గమనం లేక పోయే సర
యజ్న యాగాదులు, బ్రాహ్మల సంధ్యా వందనాదులు ఆగి పోయాయి. సృష్టి-స్తితి-లయాలకు కారణమైన సూర్యుని గతి ని స్తంభింప జేసి నందుకు మూడు లోకాలు తల్లడిల్లి పోయాయి. దేవత అందరు బ్రహ్మ దేవుని చేరి మొర పెట్టుకోవాలని బయల్దేరారున్ ’బ్రహ్మను దర్శించి స్తోత్రాలతో తృప్తి చెందించారు, దానికి బ్రహ్మ పరమానంద భరితుడైనాడు. ఏమి వరం కావాలో కోరుకో మన్నాడు త్రిమూర్తుల మైన తాము సృష్టి స్తితి లయాలను చేస్తామని కోరిన కోర్కెలను తీరుస్తామని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ వారికి సత్య లోకం లోని విశేషాలను వివరించి చేప్పాడు.
‘’ఈమె భారతి నా భార్య, ఇవి శ్రుతి స్మృతులు. ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు.
వీరు వేదాధ్యన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు .’’అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ.
‘’ఈమె భారతి నా భార్య, ఇవి శ్రుతి స్మృతులు. ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు.
- ➣ వీరందరూ చాతుర్మాస్యాది వ్రతాలు చేసిన బ్రాహ్మణులు.
- ➣ వీరు పతివ్రతలు.
- ➣ వీరు బ్రహ్మ చారులు .
- ➣ వీరు మాతా పితర పూజ చేసిన పుణ్యాత్ములు.
- ➣ వీరు గోసంరక్షణ చేసిన వారు.
- ➣ వీరు నిష్కామ కర్ములు. వీరు నిత్యాగ్ని హోత్రులు , కపిల దానం చేసిన వారు వీరు.
- ➣ వీరు సారస్వత తపో సంపన్నులు.
- ➣ వీరు దానం తీసుకోని వారు.
- ➣ వీరంతా నాకు ప్రియులు సూర్య తేజం ఉన్న వారు.
వీరు వేదాధ్యన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు .’’అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ.
బ్రహ్మ మరల మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంత్రాలున్నాయని , గోవులలో హవిస్సులున్నాయని , బ్రాహ్మణులు అంటే నడిచే తీర్ధాలని ,ఆవులు పవిత్ర మైనవని ,గోవు గిట్టల నుండి రేగిన దుమ్ము కణాలు గంగా జలం అంత పవిత్ర మైనవని, ఆవుల కొమ్ముల చివర్లలో అన్ని తీర్ధాలు ఉన్నాయని ,గిట్ట లలో అన్ని పర్వతాలు ఉన్నాయని ,కొమ్ముల మధ్య గౌరీ దేవి ఉంటుందని ,గోదానం చేస్తే పితృదేవతలు మహా సంతోషిస్తారని ,ఋషులు దేవతలు ప్రీతీ చెందుతారని గోవు లక్ష్మీ స్వరూపమని పాపాలను పోగొట్టు తుందని వివరించాడు .
గోమయం యమునా నది అని,గోమూత్రం నర్మదా నదీ జలం , ఆవు పాలు గంగోదకం అని , దాని అన్ని అంగాలలో అన్ని లోకాలు ఉన్నాయని బ్రహ్మ చెప్పాడు. ఎవరు గంగా స్నానం చేస్తూ ఆ నది ఒడ్డున నివశిస్తూ పురాణాలు వింటాడో వాడు సత్య లోకానికి అర్హుడు అని తెలిపాడు. ఇంతకూ దేవతలేందుకు వచ్చారో మళ్ళీ అడిగాడు. వింధ్యాద్రి చేసిన పనిని వివరించారు దేవతలు .అప్పుడు బ్రహ్మ వారితో ‘’కాశీ క్షేత్రం అవి ముక్త క్షేతం. అక్కడ మహా తపస్వి అయిన అగస్త్య మహర్షి నిత్య విశ్వేశ్వర దర్శనం గంగా స్నానాల తో పునీతు డవుతున్నాడు .ఆయన దగ్గరకు వెళ్ళండి .ఆయనే తగిన ఉపాయం చెప్ప గలదు. మీ ప్రయత్నం సఫలం అగు గాక ‘’అని చెప్పి అదృశ్య మయాడు .బ్రహ్మ దర్శనం అయి నందుకు , కాశీ క్షేత్ర దర్శనం, గంగా విశ్వేశ్వరఅగస్త్య దర్శనం చేయమని ఆయన చెప్పిన సలహా కు ఆనంద పడి దేవత లందరూ కాశీ పట్నానికి బయల్దేరి వెళ్లారు

కాశీ ఖండము, రెండవ భాగము - అగస్త్యాశ్రమం ➤➤