శ్లో| సౌరాష్ట్రదేశే విశదేరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే
శ్రీశైల శృంగే విబుధాతిసంగే తులాద్రితుంగే పి ముదావసంతమ్
త మర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుమ్
అవంతికాయం విహితావతారం ముక్తిప్రదానాయ ఛ సజ్జనానామ్
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశమ్
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతామోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిదానే సదా వసంతం గిరిజాసమేతం
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలారాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి
సానంద మానంద వనే వసంత మానందకాండం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారాతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రప్రద్యే
జ్యోతిర్మయ ద్వాదశలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ ||
జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.
భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపుఒడ్డున రెండు (బంగాళాఖాతాతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు.
ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము.
తైత్తీరీయోపనిషత్తుననుసరించి:
- 1. బ్రహ్మ
- 2. మాయ
- 3. జీవుడు
- 4. మనస్సు
- 5. బుద్ధి
- 6. చిత్తము
- 7. అహంకారాము
- 8. పృథ్వి
- 9. జలము
- 10. తేజస్సు
- 11. వాయువు
- 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి.
ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్కలింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.
సోమనాథ జ్యోతిర్లింగం - Samanatha Temple |
1. సోమనాథ జ్యోతిర్లింగం
స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.
బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా అం జరిపించాడు దక్షుడు.
అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించ సాగాడు.
చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని అస్థరాధించిన చంద్రుదు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొకకళ చొప్పున పెరుగుతుందని అను గ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.
సోమనాథ ఆలయం సమాచారం కోసం సంప్రదించండి:
Shree Somnath Trust

- ➛ C12/A,Om Villa Flats,Nr. Telephone Exchange,Next to Om Tower,F.C.I. Godown Road,Shahibaug, AHMEDABAD-380004.GUJARAT, INDIA.
- ➛ Phone and Fax No : +91-79-22686335
- ➛ Phone No : +91-79-22686442,
- ➛ Email : somnathshahibaug@gmail.com
- ➛ Shri. Vijay Vasante
- ➛ Mobile : +91-99982 37189
మల్లిఖార్జున జ్యోతిర్లింగం - Srisailam Mallikarjuna Swamy |
2. మల్లిఖార్జున జ్యోతిర్లింగం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలిఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే ‘శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద’ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగపూరమ్లో ఆవిర్భవించాడని మరోకథనం.
కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దారుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే ||
కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంటరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణకథనం. సీతారాములు రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రప్రతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.
శ్రీ శైలం ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Srisaila Devasthanam,
శ్రీ శైలం ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Srisaila Devasthanam,
- ➛ Srisailam - 518101,
- ➛ Kurnool (Dt),
- ➛ Andhra Pradesh (State).
- ➛ E-Mail : eo@srisailamonline.com, endow-eosri@gov.in
- ➛ ఫోన్ నంబర్లు: S.T.D CODE : 08524 - 8333901351, 8333901352, 8333901353, 8333901354, 8333901355
మహాకాలేశ్వర జ్యోతిర్లింగం - Mahakal Temple Ujjain |
3. మహాకాలేశ్వర జ్యోతిర్లింగం - ఉజ్జయిని
పరమేశ్వరునికి అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి.
కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నిటికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఏడారి – పొలం – పీఠం – అరణ్యం అంటూ ఐదు ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూరవం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు.
ఈ నలుగురు కూడ శివభాక్తులే. ఇదిలాఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణా సురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్ససుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని, అతని సైన్యాన్ని భస్మం చేసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.
మహాకాలేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Shree Mahakaleshwar Temple

- ➛ E-mail: office@mahakaleshwar.nic.in
- ➛ Tel.: 0734-2550563
- ➛ Dharmshala: 0734-2551714, 0734-2585873, IT: 0734-2551295
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం - Omkareswar Jyothirlinga |
4. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గోప్పవారెవరూ లేరని విర్రవీగురుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పమహర్షి దని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికివెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాని సాధించుకునే శక్తిని ప్రసాదించ’ మని వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వారంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రాణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు.
ఇదిలాఉండగా, శివునినుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడ అడ్డుతగులసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలో తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరలా ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరుగలేదు.
ఓంకారేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Shree Omkareswar Temple

- ➛ Omkareshwar, Khandwa Omkareshwar, Madhya Pradesh 451115, India
- ➛ సంప్రదించండి: +91 72802 71228, +91-7280-271228
- ➛ వెబ్ సైట్: www.shriomkareshwar.org
వైద్యనాథ జ్యోతిర్లింగం - Baba Baidyanath Dham |
5. వైద్యనాథ జ్యోతిర్లింగం
వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గణా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరాగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలో లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది.
అయితే జార్ఘండ్ వైద్యనాథమ్ లో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరానియమాలతో, ఒక చేట్టుకుండా అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవాన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా, శివుడు రావుణుడు కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు.
ఆత్మలింగంతో లంకానగారానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడిపోతుంది. రావణుడు ఎంతగా ఆ ఆత్మలింగాన్ని పెకలించి లంకానగారానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు.
వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది. కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచాశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూడార్థం.
వైద్యనాథ ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Baba Baidyanath Dham

- ➛ Mr. Vishal Sagar, SDO-cum-Temple Incharge, Baba Baidyanath Mandir, Deoghar,
- ➛ Phone : +91 6432 232295 (Temple)
- ➛ Mr Anand Kumar Tewari, Assistant Temple Incharge,
- ➛ Mobile: +91 9430322655
- ➛ Mr Ramesh Kumar Parihast, Temple Manager,
- ➛ Mobile: +91 8986563071
- ➛ Fax: (91-6432) 232967
- ➛ Email: dcdgr@rediffmail.com, contact@babadham.org
- ➛ వెబ్ సైట్: www.babadham.org
నాగేశ్వర జ్యోతిర్లింగం - Nageshwar jyotirlinga |
6. నాగేశ్వర జ్యోతిర్లింగం
పశ్చిమ సముద్ర తీరాన, దారకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలసి ప్రజలను చిత్రహింసలకు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న విన్చుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పై పనిచేస్తుంది.
కనుక, రాక్షసదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరచుకుని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివ భక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గోలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగారూపమై జ్యోతిర్లింగమై వెలిసాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.

నాగేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
- ➛ Daarukavanam, Dwarka, Gujarat 361345, India
- ➛ contact: +91-79-23977200
కేదారేశ్వర జ్యోతిర్లింగం - Kedarnath Alayam |
7. కేదారేశ్వర జ్యోతిర్లింగం
ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అత్యంత నిష్ఠాగరిష్టులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సును మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగరూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రాసాదింపమని ప్రార్థించారు.
ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కే
దారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. దీపావళి రోజున స్వామికి నేతితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునేలలపాటూ ఆలయంమూసి ఉన్నసమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు.
ఇక్కడ ఆమవారైన కేదార గౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాడవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హింసకుండం, ఉదక కుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చెసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చొట్ల నుండి సీసాలలొ గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చెయిస్తుంటారు.
కేదారేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Shri Kedarnath Dhaam

- ➛ Omkareswar Temple,
- ➛ Post Ukhimatt, District Rudraprayag, Uttarakhand
- ➛ Contact Number- 01364-284228
ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడ పిలుస్తారు. త్రియంబకేశ్వరుడు స్వయంభువు. అమ్మవారు త్రియంబకేశ్వారి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు.
ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు త్రిమూర్త్యత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సమేతంగాగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణఖ శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు.
శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’ గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగారి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యాసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భువికి రప్పించాలని నిర్ణయించిన మునులు తగిన పథకాన్ని గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు.
ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి.
మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు.
వెయ్యేళ్ళు శివునిప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమమహర్షి. గౌతమమునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది.
ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతి, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మనరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువుగా వెలసిన స్వామి, భక్తులను తనన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.
త్రియంబకేశ్వర్ ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:

- ➛ Sau.Manasi Ajit Chandwadkar
- ➛ 170, Main Road, Opp. Satyanarayan Mandir
- ➛ Near Kushavarta Kund,
- ➛ Trambakeshwar .Nashik 422212.
- ➛ Mobile: +91 9822222530
- ➛ Mobile:- +91 9371004172
- ➛ Land Line :+912594234070
రామేశ్వర జ్యోతిర్లింగం - Rameswaram |
9. రామేశ్వర జ్యోతిర్లింగం
రావణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత, లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోద్యానగారానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు.
- ⧫ అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు.
- ⧫ అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు.
- ⧫ శ్రీరాముడు శివలింగాన్నోకటి తీసుకురమ్మని హనుమను పురమాయిన్చాగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది.
- ⧫ వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు.
- ⧫ ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమతుండు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకుని పరిపరి విధాలుగా చింతిస్తాడు.
- ⧫ ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు ఆ సైకతలింగాన్ని తొలగించి, రజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టించమని చెబుతాడు.
- ⧫ రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహంతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు.
- ⧫ చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు.
- ⧫ ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుముహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహాత్మ్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం తీసుకొచ్చిన లింగాన్ని సైకత లింగం ప్రక్కనే ప్రతిష్టించమని చెప్పాడు.
- ⧫ అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి.
- ⧫ రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహాత్యాది దోషాలు తొలగిపోతాయి.
- ⧫ కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.
రామేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
- ➛ Arulmigu Ramanathaswamy Temple
- ➛ Ramanathapuram, District,
- ➛ Rameswaram - 623 526.
- ➛ Phone No. : 04573 - 221223
- ➛ Fax and Computer Section No. : 04573 - 223230
- ➛ E-Mail ID : lordramnath2012@gmail.com
భీమశంకర జ్యోతిర్లింగం - Bheema Shankara Jyotirlingam |
10. భీమశంకర జ్యోతిర్లింగం
త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు.
భీమశంకర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Address for Corrospondance :
- ⭄ కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాదునికి ఇచ్చి పెండ్లి చేశారు.
- ⭄ ఆ విరాధుడు, శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానడిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళించేందుకు ప్రయత్నించి, ఆ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది.
- ⭄ అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్నాకర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు.
- ⭄ ఫలితంగా కర్కటి గర్భవతి అయి భీమాసురునికి జన్మనిచ్చింది.
- ⭄ తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విశ్నువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు.
- ⭄ ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాదిపతి సుదక్షిణుని ఓడించి కారాగ్రుహంలో బంధించాడు. అతని భార్య సుదక్షిణాదేవిని కూడా బంధిస్తాడు.
- ⭄ కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేసూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాధించసాగారు.
- ⭄ వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు.
- ⭄ రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతోస్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షససంహారం గావించాడు.
భీమశంకర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Address for Corrospondance :
- ➛ Shivtirtha Bhimashankar,
- ➛ Shri Kshetra Bhimashankar, Via - Dimbhe Colony,
- ➛ Taluka - Khed, Dist - Pune. Pincode : 410509
- ➛ Email : ganesh@bhimashankar.in
- ➛ Mobile : 9970045972 (Ganesh Gawande)
విశ్వేశ్వర జ్యోతిర్లింగం - SHRI KASHI VISHWANATH TEMPLE |
11. విశ్వేశ్వర జ్యోతిర్లింగం
ఈ సృష్టికి ముందు నుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు.
ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం నుండి ప్రకృతి, పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్నిప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశీ పట్టణం.
పరమాత్మ ఆదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు అతని వేడికి శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జలప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణిక’గా ప్రసిద్ధమైంది.
అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్న నారాయణుని నాభికమలంనుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞణు అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పధ్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది.
ఐరావతాదులతో బ్రహ్మాండంలో సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దెవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలకించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, డుంఢితో సహా 56 గనపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని, భిందు మాధవుని, డుండిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చెయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది.
కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామతారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతోకాలం పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.

- ➛ Chief Executive Officer
- ➛ Shri Kashi Vishwanath Temple Help Desk
- ➛ CK 37/40,41,42 Bansphatak, Varanasi-221 001
- ➛ Phone : 0542- 2392629, +91-6393131608
- ➛ Email :shrikashivishwanathtempletrust@gmail.com, support@shrikashivishwanath.org
- ➛ Hours : सोमवार - शनिवार 6:00 AM - 6:00 PM
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం - Grishneshwar Jyotirlinga |
12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
పూర్వం దేవగిరి సమీపంలో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికీ సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఒక యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు.అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.
భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సంగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది ఆ యతీశ్వరుని నియమం.
ఆ దంపతులు యతీశ్వరుని కాళ్ళపైబడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తెలుగున చెల్లెలు ఘుశ్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది.
సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతియైన ఘుశ్మ, అక్క సుదేహను తల్లిలా, భారతాన్నిఉ దైవసమానునిగా భావించి సేవిస్తుండేది. అచిరకాలంలోనే ఘుశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఘుశ్మ మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగాడు. అయితే సుదేహ మనసులో అసూయాజ్వాలలు రెడ్డిగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్వాద్వేషాలను పెంచుకొసాగింది.
ఒకరోజు రాత్రి సుదేహ, పసివాని గొంతు కోసి, తనను మొండేన్ని వేరువేరుగా చెరువులో విసిరేసింది. ఇదంతా తెలియని ఘుశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికివెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూవచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది.’ అని చెప్పాడు.
కొడుకు చెప్పిన సంగతిని విన్న ఘుశ్మ దిగ్ర్భమ చెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలోచించసాగింది. అలా ఆమె దీర్ఘాలోచనాలోనుండగా, శివుడు ప్రత్యక్షమై సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. ఆప్పడు శివుని కాళ్ళపై బడిన ఘుశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది ఘృష్ణేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళెవై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోక్ర్థన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి.
ఘృష్ణేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం |

- ➛ Grishneshwar Temple Contact
- ➛ Phone No :- 02437244585
- ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలం -
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.
- 1. సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.
- 2. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.
- 3. ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.
- 4. అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.
- 5. శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.
- 6. ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.
- 7. సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన
- మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.
- 8. మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.
- 9. చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.
- 10. నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.
- 11. శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం
- చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.
- 12. ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.
సంకలనం: నాగవరపు రవీంద్ర