అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో బాబ్రీ కట్టడం నిర్మించారన్నది పచ్చి నిజం, నిర్వివాదాంశం.
సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు మేరకు అయోధ్యలో శ్రీరామ భవ్యమందిరం పునర్నిర్మాణం జరుగుతున్నకోసం పనులు వేగవంతం అయ్యాయి. మే 11 నుండి ప్రారంభమైన పనుల్లో భాగంగా బాబ్రీ మసీదు ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో నాటి శ్రీరాముడి మందిరం తాలూకు అనేక చారిత్రక అవశేషాలు లభ్యమయ్యాయి.
దీంతో అక్కడ మందిరం ఉండేది అంటూ 1975, 2002 సంవత్సరాల్లో భారతీయ పురాతత్వ శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సమర్పించిన రిపోర్టులకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఈ మొత్తం ఉదంతంలో అక్కడ రామాలయం ఉండేది అనడంలో ప్రజలకు సందేహం లేదు, కాకపోతే చరిత్రను కావాలని వక్రీరించే ప్రయత్నం చేసిన వామపక్ష -నెహ్రూ భావజాలపు చరిత్రకారులైన రొమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ వంటివారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అనేదే ప్రశ్న. గతంలో అక్కడ ఇలాగే కొన్ని అవశేషాలు బయటపడితే అవి విహింప వారే అక్కడ పెట్టారంటూ కొందరు అసత్య ప్రచారం చేశారు కూడా.
సుప్రీం కోర్టు తీర్పు మేరకు అయోధ్యలో జరుగుతున్న శ్రీరామ భవ్యమందిరం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా ప్రభుత్వం బాబ్రీ కట్టడపు ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో ఐదు అడుగుల శివలింగం దర్శనమిచింది. ఇంతే కాకుండా ఎరుపురంగు ఇసుకరాయితో నిర్మించిన ఆరు స్థంబాలు, నలుపురంగు రాతితో నిర్మించిన 5 స్థంబాలు, పాక్షికంగా ధ్వంసం అయిన ఇతర దేవీదేవతల విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి.
ఈ విషయాన్ని అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ ఒక ప్రకటనలో తెలియజేసారు.
Statement of Shri Champat Rai, Trust General Secretary about findings of excavation activity at Shri Ramjanmbhumi.— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) May 20, 2020
श्री रामजन्मभूमि परिसर में मिले पुरातत्विक महत्व के स्तम्भों और अन्य वस्तुओं के संदर्भ में श्री रामजन्मभूमि तीर्थ क्षेत्र के महामंत्री श्री चम्पत राय जी का वक्तव्य pic.twitter.com/XczrY6wjgk
రామజన్మభూమి నిర్మాణ కమిటీకి చెందిన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వీటి ఫోటోలు పోస్ట్ చేసింది.
కెకె మహ్మద్ వాదనకు మరింత బలం:
తాజాగా రామజన్మభూమి స్థలంలో లభించిన ప్రాచీన ఆలయం తీలుకు కళాఖండాలు, భారతీయ పురాతత్వ శాఖలోని నాటి సీనియర్ అధికారి కెకె మహ్మద్ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 1975-76 మధ్య కాలంలో ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనా బృందంలో సభ్యులైన కెకె మహ్మద్, వాటి వివరాలు వెల్లడించారు. ఆలయం ధ్వంసం చేసి నిర్మించిన మసీదు అంతర్భాగం పైకప్పు ప్రతిభాగంలోనూ ప్రాచీన హిందూ దేవాలయం అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. అంతేకాకుండా ఇదే విషయాన్నీ గత 20 ఏళ్లుగా అనేక ఇంటర్వ్యూలలో పునరుద్ఘాటించారు. ఈ విషయాలను బయటపెట్టే క్రమంలో కమ్యూనిస్ట్ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ నుండి అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలియజేసారు.
మూలము: విశ్వ సంవాద కేంద్రము