జ్యోతి సిద్ధవటం
- ➣ రాయలసీమలో పెన్నా నది వడ్డున కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి..
- ➣ రాజుల కాలం నాటి ఆలయాలు చాలావరకు కాలగర్భంలో కలిసిపోయాయి..
- ➣ అలాంటి మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రమే జ్యోతి సిద్ధవటం.
- ➣ కడప జిల్లాలోని సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుకలో అప్పటి ముస్లిం పాలకులచే కప్పబడి ఉన్న 108 శివాలయాల ఆలయాన్ని ఈమధ్యనే వెలికితీశారు,
- ➣ ఈ ఆలయం 1213 వ సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు.
- ➣ 108 శివాలయాలు గల ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది.
జ్యోతి సిద్ధవటం - siddavatam |
జ్యోతి సిద్ధవటం - siddavatam |
జ్యోతి సిద్ధవటం - siddavatam |
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది. ఈ ఆలయములోని శిలా శాసనమును బట్టి కాకతీయ రుద్రమ్మ దేవి వెండి రథము, వజ్రపు కిరీటం ఈ ఆలయమునకు బహూకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం లోపలి భాగం మాత్రం పటిష్టంగా ఉన్నా బయట నుండి మాత్రం ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా అత్యంత దయనీయ స్థితిలో ఉంది.
ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడా కానీ పురావస్తుశాఖ ఆనవాళ్ళు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం గమనార్హం... స్థానిక ప్రజలే ఈ ఆలయ ఆలన పాలన చూస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన పవిత్ర పెన్నానది తీరాన ఉన్నది ఈ దివ్య క్షేత్రము. ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తే గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది.. ఇక్కడికి చేరుకోవడానికి కడప నుండి సిద్దవటం చేరుకుంటే అక్కడి నుండి జ్యోతి గ్రామానికి ఆటోలు వెళుతుంటాయి.
సంకలనం: మంగళ ఆంజనేయ అవధాని